నవంబర్ 15వ తేదీన మేకర్స్ SSMB 29 చిత్రానికి సంబంధించి హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఈవెంట్ ని ప్లాన్ చేసి అప్డేట్ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ అప్డేట్ కోసం ఇండియన్ సినీ ప్రేక్షకులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతకంటే ముందుగానే ఒక భారీ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రాకి సంబంధించి నవంబర్ 11న అంటే రేపటి రోజున ఫస్ట్ లుక్ ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట.
ముందు చెప్పినటువంటి అప్డేట్ లాగే ఈ అప్డేట్ కూడా అదే రోజు అనౌన్స్మెంట్ చేసి విడుదల చేయబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా చెప్పకుండానే వరుస సర్ ప్రైజ్ తో భారీ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. దీంతో మహేష్ బాబు అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. రాజమౌళి సినిమా అంటే ఎలాగైనా ఆలస్యం అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే ఈ అప్డేట్లతో అభిమానులు కూడా ఖుషీగా చేయబోతున్నారు. మరి ప్రియాంక చోప్రా కు సంబంధించి ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో అనే విషయం తెలియాల్సి ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి