సీనియర్ దర్శకుడు తేజ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ బలగం దర్శకుడు వేణు గురించి ఓక ఆసక్తికర విషయం చెప్పారు. తాను ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశాను అన్న తేజ వారిలో కొందరు మాత్రమే నేను చెప్పిన సూక్తులు పాటించి ఉన్నత స్థానాలకు రావడంతో పాటు తనను ఎప్పటకీ గుర్తు పెట్టుకున్నారని చెప్పారు. తాను ఎప్పుడు ఆర్టిస్ట్ లకు ఒక్కటే చెప్తా.. నన్ను వాడుకోండి. నేను మీకు అవకాశాలు ఇస్తాను మీ టాలెంట్ తో స్టార్స్ అవ్వండి, కోట్లు సంపాదించండి అని చెప్తాను.. అలాగే బలగం సినిమా దర్శకుడు వేణు గురించి కూడా ఒక అనుభవం పంచుకున్నారు.
వేణు నా జై సినిమాలో నటించాడు. జై సినిమాలో కమెడియన్ పాత్ర చేశాడు. సినిమా ఆడిషన్స్ కు వచ్చాడు. నచ్చాడు.. ఒకరోజు. అతని భుజం మీద చెయ్యివేసి.. సినిమాలో నీది కమెడియన్ పాత్ర.. చాలా ఇంపార్టెంట్ రోల్.. అని తీసుకెళ్తుంటే..వేణు వెక్కి వెక్కి గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. ఏమైంది అంటే.. లేదు సార్ నేను ఇన్నిరోజులుగా ఉంటున్నాను.. మిమ్మల్ని కలిస్తే చాలు అనుకున్నా నా భుజం మీద చేయ్యేస్తారని కూడా అనుకోలేదు అని ఓ ఏడ్చేశాడు.. దానికి నేను లేదు లేదు నువ్వు స్టార్ అవ్వాలి.. కోట్లు సంపాదించాలి.. నువ్వు బిజీ అవ్వాలి.. నువ్వు నన్ను వాడుకో.. నా సినిమాని వాడుకో.. అని చెప్పా అన్నారు తేజ.తేజ అన్నట్టుగానే వేణు ఒక దశ వరకు కమెడియన్ గా బాగానే రాణించాడు. తర్వాత మెగా ఫోన్ పట్టి బలగం అనే బ్లాక్ బస్టర్ తీసి ఇప్పుడు ఎల్లమ్మ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి