నిరంతరం విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ నటుడుగా, డైరెక్టర్గా పేరు సంపాదించారు రవిబాబు. రవిబాబు ఎవరో కాదు దివంగత నటుడు అయినా చలపతిరావు కుమారుడే. కెరియర్ ప్రారంభంలో తన తండ్రిలాగే విలన్ పాత్రలో నటించి పేరు సంపాదించిన రవిబాబు, ఆ తర్వాత డైరెక్టర్ గా మారారు. మొదటిసారి అల్లరి నరేష్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన అల్లరి సినిమాని డైరెక్షన్ చేశారు రవిబాబు. ఈ సినిమా కామెడీతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు, పార్టీ, సోగ్గాడు తదితర చిత్రాలతో ఆకట్టుకున్నారు.


అయితే ఎప్పుడు రొటీన్ కథలే కాకుండా అనసూయ, అమరావతి వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించారు. రవిబాబు హర్రర్ నేపథ్యంలో తెరకెక్కించిన అవును సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అవును 2 , లడ్డు బాబు అనే సినిమాలను చేశారు. ఈ మూడు చిత్రాలలో హీరోయిన్గా పూర్ణ నటించింది. అయితే ఆ సమయంలో అటు హీరోయిన్ పూర్ణ , రవిబాబు కు ఎఫైర్ ఉందంటూ రూమర్స్ వినిపించాయి. పూర్ణ వివాహం అయ్యే వరకు ఈ న్యూస్ మరింత వైరల్ గా మారింది.


అయితే ఈ విషయం పైన గతంలో కూడా రవిబాబు మాట్లాడుతూ పూర్ణతో వరుస సినిమాలు చేయడం వల్లే ఇలాంటి రూమర్స్ వచ్చాయి.. పైగా మీడియా పదే పదే ఈ విషయాన్ని చాలా సార్లు స్ప్రెడ్ చేసింది. పూర్ణ ఎక్కడో కేరళలో పుట్టింది అనవసరంగా ఆమెకు నాకు లింకు పెట్టారు. నా సినిమా కథలకు ఆమె పాత్ర సెట్ అయ్యే హీరోయిన్ కాబట్టి ఎంపిక చేసుకున్నాను.. ఆమె తన పాత్రలో చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఆమె చేసిన తర్వాత వన్ మోర్ టెక్ అని అడగడానికి కూడా భయపడతాను అలాంటి డెడికేషన్ కలిగిన అమ్మాయి అంటూ తెలిపారు. కేవలం పూర్ణ తో ఎక్కువ సినిమాలు చేయడం వల్లే  రూమర్స్ వినిపించాయని తెలిపారు రవిబాబు. ప్రస్తుతం రవిబాబు సినిమాల విషయానికి వస్తే ఏనుగు తొండం ఘటికాచలం వంటి చిత్రాలను చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: