టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ చాలా సంవత్సరాల క్రితం కెరియర్ను మొదలు పెట్టాడు. ఈయన నటుడిగా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత అనేక సంవత్సరాలు పాటు ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ వచ్చాడు. ఈయనకు అద్భుతమైన గుర్తింపును తీసుకు వచ్చిన సినిమాలలో డీజే టిల్లు మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సినిమా విడుదలకు ముందు సిద్దుకు పెద్దగా క్రేజ్ లేదు. ఈ సినిమా విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడం , ఇందులో సిద్దు తన బాడీ లాంగ్వేజ్ తో , డ్రెస్సింగ్ స్టైల్ తో , నటనతో ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ వల్ల ఈయన కు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత సిద్దు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా సూపర్ సాలిడ్ విజయాన్ని సాధించడంతో సిద్దు క్రేజ్ ఒక్క సారిగా తెలుగు సినీ పరిశ్రమలో అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ తర్వాత ఈయన జాక్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. ఈ మూవీ తో సిద్దుకు భారీ ఆపజయం దక్కింది. ఈ మూవీ తర్వాత ఈయన తెలుసు కదా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చిన ఈ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేయడంలో మాత్రం విఫలం అయింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు నవంబర్ 14 వ తేదీ నుండి తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. మరి ఈ మూవీ ఓ టీ టీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమా ఓ టీ టీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోనట్లైయితే సిద్దుకు ఈ మూవీ ద్వారా భారీ ఎదురు దెబ్బ తగిలినట్లు అవుతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: