చాలా తక్కువ సమయం లో అద్భుతమైన గుర్తింపును తమిళ్ , తెలుగు ఇండస్ట్రీ లలో సంపాదించుకున్న ముద్దు గుమ్మ లలో కీర్తి సురేష్ ఒకరు. ఈమె తమిళ సినిమాల ద్వారా నటిగా కెరియర్ను మొదలు పెట్టింది. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె మొదట గా తెలుగు లో రామ్ పోతినేని హీరో గా రూపొందిన నేను శైలజ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ,  ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమె నటించిన నేను లోకల్ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇకపోతే ఈమెకు నటిగ అద్భుతమైన గుర్తింపును తీసుకు వచ్చిన సినిమాలలో మహానటి మూవీ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈ మూవీ తో ఈమెకు అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈమె ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించింది.

కానీ ఏ సినిమా కూడా మహానటి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. కానీ ఈమె మాత్రం వరుస పెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూనే వస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రివర్వాల్ రిటా అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ని నవంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇక మహానటి సినిమా తర్వాత అనేక లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈమెకి మంచి విజయం దక్కలేదు. మరి రివర్వాల్ రిటా తో ఈమెకి మంచి విజయం దక్కించుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ks