8 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.66 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 1.48 కోట్లు , ఆంధ్ర లో 3.94 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 8 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 9.08 కోట్ల షేర్ ... 16.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. 8 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 68 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్ సిస్ లో 50 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 8 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 10.26 కోట్ల షేర్ ... 18.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల టార్గెట్తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో 9.74 కోట్ల షేర్ కలెక్షన్లు వసూలు చేసినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్టుగా నిలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి