తెలుగు బిగ్ బాస్ టెలివిజన్ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. తెలుగు బిగ్ బాస్ టెలివిజన్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో అరియనా గ్లోరీ ఒకరు. ఈమెకు బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా క్రేజ్ లేదు. ఎప్పుడైతే ఈమె బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చిందో ఆమెకు ఈ షో ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఈ షో నుండి బయటకు వచ్చాక కూడా ఈమె ప్రస్తుతం ఎంతో బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తోంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

ఆ ఇంటర్వ్యూ లో ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె తన ప్రేమ కథకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా అరియనా మాట్లాడుతూ ... నేను 9 వ తరగతి చదువుతున్న వయసు లోనే మా బావతో ప్రేమలో పడ్డాను. ప్రేమలో పడ్డాక మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. ఇక మేము ఇద్దరము ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాము. హైదరాబాద్ కు వచ్చాక మూడు సంవత్సరాల పాటు ఇద్దరం ఒకే రూమ్ లో ఉన్నాము.

ఆ తర్వాత మా ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో మేము విడిపోయాము. ఇక మా బావతో విడిపోయాక నేను ఎంతో బాధ పడ్డాను అని అరియనా తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది. ఇకపోతే బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ హౌస్ నుండి బయటకు వచ్చాక అనేక టెలివిజన్ కార్యక్రమాలలో పాల్గొని మంచి గుర్తింపును , క్రేజ్ ను సంపాదించుకుంది. ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది అవి కూడా చాలా వరకు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: