తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చాలా సంవత్సరాల క్రితం నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. ఈయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే ఈయనకు సంబంధించిన ఏదైనా ఈవెంట్ జరిగింది అంటే చాలు దానికి పెద్ద సంఖ్యలో జనాలు విచ్చేస్తూ ఉంటారు. ఇక పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో కి సంబంధించిన ఏదైనా ఫంక్షన్ ఓపెన్ గ్రౌండ్స్ లో నిర్వహించినట్లయితే కాస్త బెటర్ గా ఉంటుంది అని అనేక మంది అభిప్రాయ పడుతూ ఉంటారు.

ఇక పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు అనేక మంది విచ్చేస్తూ ఉండడంతో ఆయన ఫంక్షన్ ఏదైనా చిన్న వేదికలో నిర్వహించినట్లయితే ఆ ఫంక్షన్ కి వచ్చే జనాలకు అలాగే ఆ ఫంక్షన్ కి విచ్చేసే సెలబ్రిటీలకు , యాంకర్లకు కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నట్లు స్టార్ యాంకర్ సుమ తాజాగా చెప్పుకొచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... తాజాగా యాంకర్ సుమ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా సుమ , పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ... పవన్ కళ్యాణ్ గారికి చాలా మంది అభిమానులు ఉంటారు. ఆయనకి సంబంధించిన ఈవెంట్ అంటే అనేక మంది వస్తూ ఉంటారు. శిల్పకళా వేదికలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రెండు సినిమాల ఈవెంట్లకు నేను యాంకరింగ్ చేశాను. ఇక అనేక మంది ఆయన ఈవెంట్ కు రావడంతో బయటికి వెళ్లడానికి కూడా స్థలం ఉండదు. దానితో నేను కిటికీ లోంచి బయటికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి అని ఈమె చెప్పుకొచ్చింది. తాజాగా సుమ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: