టాలీవుడ్‌లో చాలా మంది సినిమాటోగ్రాఫర్లు .. హీరోలు , పాటల రచయితలు కూడా మెగా ఫోన్ పట్టి దర్శకులు అయ్యారు. ఈ కోవలోనే రెండు దశాబ్దాల క్రితం ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు అదిరిపోయే పాటలు రాసిన ఓ రచయిత కూడా మెగా ఫోన్ పట్టి దర్శకుడు అయ్యారు. ఆయనే కులశేఖర్. “ చిత్రం , నువ్వు - నేను , జయం ” వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల సింగిల్ కార్డ్ పాటల రచయిత కులశేఖర్ ఒక దశలో డైరెక్షన్ మీద విపరీతంగా మోజు పడ్డారు. ఇందుకోసం కులశేఖర్ పాటల రచయితగా ఫుల్ ఫామ్‌లో ఉండి కూడా ఎన్నో పాటలు వదిలేసుకున్నారు. ఇలా కులశేఖర్ మెగా ఫోన్ పట్టి దర్శకుడి గా మారి దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ప్రేమలేఖ రాశా. ఈ సినిమా షూటింగ్ దశలోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.
చివరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని 2007 లో విడుదలైంది. ఇందులో హీరో హీరోయిన్లు వేణు మల్లిడి, అంజలి. ఇద్దరికీ ఇదే తొలి చిత్రం. ఈ వేణు మల్లిడి తర్వాత వశిష్ట గా పేరు మార్చుకుని, నందమూరి కళ్యాణరామ్ హీరోగా ‘ బింబిసార ‘ సినిమా డైరెక్ట్ చేశారు. అలా నాడు కులశేఖర్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ప్రేమలేఖ రాశా సినిమా లో హీరోగా చేసిన మల్లిడి వేణు ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ క్రేజీ డైరెక్టర్ అయ్యాడు. బింబిసార సూపర్ హిట్ అయ్యాక బింబిసార సినిమాకు సీక్వెల్‌గా బింబిసార 2 సినిమా సెట్స్ మీదకు వెళుతుందని అందరూ అనుకున్నారు. ఇంతలోనే సెడన్ గా చిరంజీవి నే డైరెక్ట్ చేసే అవకాశం వశిష్టకు దక్కింది. వశిష్ట ప్రస్తుతం చిరంజీవి తో ‘ విశ్వంభర ‘ తీస్తున్నారు. ఎంతోమంది బాల బాలికలకు సంగీత శిక్షణ ఇచ్చిన రామాచారి కి సంగీత దర్శకుడిగా ఇదే తొలి చిత్రం. అయితే ఆయన పేరు శ్రీరామ్ కౌషిక్ అని ఉంటుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి