ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో శ్రీ లీల ఒకరు. ఈమె ఇప్పటివరకు నటించిన సినిమాలలో చాలా తక్కువ సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న ఈమె నటించిన ప్రతి సినిమాలో కూడా తన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో ప్రస్తుతం ఈమె తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిజిక్ కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఇంత కాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస పెట్టి అవకాశాలను దక్కించుకున్న ఈమె ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తుంది.

ప్రస్తుతం ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ హీరో గా రూపొందుతున్న పరాశక్తి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని మరి కొంత కాలం లోనే విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల కాక ముందే శివ కార్తికేయన్ హీరో గా రూపొందబోయే మరో సినిమాలో ఈ ముద్దు గుమ్మ కు హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... శివ కార్తికేయన్ తన తదుపరి మూవీ ని శిబి చక్రవర్తి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ లో కూడా శ్రీ లీల ను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లో ఈ మూవీ బృందం వారు విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.  గతంలో శివ కార్తికేయన్ , సిబి చక్రవర్తి కాంబోలో డాన్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. వీరి కాంబోలో రూపొందబోయే రెండవ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: