టాలీవుడ్ ప్రముఖ సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై స్పందించారు. ఓజీ సినిమా స్ట్రైట్ నెరేషన్ ఇచ్చి ఉంటే ప్రజలకు ఇంతలా కనెక్ట్ అయ్యేదే కాదన్నారు. దర్శకుడు సుజీత్ నాన్ లీయర్ స్క్రీన్ ప్లే తో సినిమాను నడిపించిన తీరు అద్భుతం అని కొనియాడారు. చూపు పక్కకు తిప్పుకోనియకుండా ఆసక్తిగా సినిమాను రన్ చేశారని తెలిపారు. తాను ఈ సినిమాను పూర్తిగా అర్థం చేసుకునేందుకు రెండుసార్లు చూడాల్సి వచ్చిందన్నారు. యూత్ బాగా మెచ్చిన ఈ పీరియాడికల్ సినిమా మహిళలకు అంతగా నచ్చి ఉండదని తాను అనుకుంటున్నట్టు తెలిపారు.
దర్శకుడు కథ నేపథ్యాన్ని బట్టి దీనిని ఓ ఇంటర్నేషనల్ ఫిలింగ్‌గా తీర్చి దిద్దారన్నారు. సినిమా బడ్జెట్, కలెక్షన్లను బట్టి చూస్తే సినిమా ఖచ్చితంగా హిట్ కింద లెక్కే అని పరుచూరి తన అభిప్రాయం స్పష్టం చేశారు. అటు ప్లాష్‌బ్యాక్ తో పాటు ఇటు ప్రజెంట్ స్టోరీ చెపుతూ సుజిత్ స్క్రీన్ ప్లేతో ఆడుకున్నాడని చెప్పారు. 400 కు పైగా సినిమాలకు పని చేసిన తానే ఈ సినిమా అర్థం చేసుకునేందుకు రెండు సార్లు చూశానంటే సుజిత్ స్క్రీన్ ప్లే ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు. ఎక్కడైనా చూపు పక్కకు తిప్పితే అసలు సినిమా అర్థం కాదేమో అనిపించిందన్నారు.
ముంబై నగరమే లేకుండా చేయాలనుకునే విలన్ పై హీరో పగ తీర్చుకోవడమే ఈ సినిమా స్టోరీ అని .. హీరో పగ , ప్రతీకారం కోణంలో నూ ఈ సినిమా ను చెప్పుకోవచ్చని.. అలాగే హీరో భార్య, బిడ్డ కోణంలోనూ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయ్యిందన్నారు. యాక్షన్ సీన్లు పెద్దవి అయినా చూడవచ్చని .. యాక్షన్ సీన్లు అదిరిపోయాయన్నారు. ఓజీని పవన్ నటన కోసం చూడాలన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి