- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

మాస్ మహారాజా రవితేజ సినిమా ప్రేమికులకి ప్రత్యేకమైన పేరు. ఆయనకు హిట్టు, ఫ్లాప్ అనే తేడా ఉండదు. ఎప్పుడూ కొత్త సినిమాలతో బిజీగా ఉండడం, ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగడం రవితేజ ప్రత్యేకత. ఒక సినిమా ఆశించిన స్థాయిలో పనిచేయకపోయినా వెంటనే తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం ఆయన కెరీర్‌లో ప్రధాన బలం. ఇటీవల విడుదలైన ‘మాస్ జాతర’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫలితం ఇవ్వకపోయినా, రవితేజ తన స్టైల్‌లోనే తదుపరి సినిమాలపై దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్లతో పాటు మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.


సినిమా పూర్తి అయిన వెంటనే రవితేజ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ ప్రాజెక్ట్‌ను ‘బింబిసార’ ఫేమ్ దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేయనున్నారు. వశిష్ట ఇప్పటికే రవితేజకు ఓ స్టోరీ నేరేట్ చేయగా, నెరేషన్ విన్న వెంటనే మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. “ ఈ కథ నా స్టైల్‌లోనే ఉంది ” అని రవితేజ చెప్పినట్లు ఫిల్మ్ సర్కిల్స్ సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయి, రవితేజ డేట్స్ కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావచ్చు.


ఇక వశిష్ట విషయానికి వస్తే ఆయన ‘బింబిసార’ సినిమా తో పెద్ద సక్సెస్ సాధించి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న ‘విశ్వంభర’ చిత్రం షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆ సినిమా వచ్చే సమ్మర్‌లో రిలీజ్ కానుంది. ఈలోగా వశిష్ట తన తదుపరి ప్రాజెక్ట్‌గా రవితేజతో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, రవితేజ - వశిష్ట కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో ఉండబోతుందట. బింబిసారలో టైమ్ ట్రావెల్ ఎలిమెంట్‌ను చూపించిన వశిష్ట, ఈసారి మరింత కొత్త కాన్సెప్ట్‌తో రాబోతున్నారని సమాచారం. రవితేజ కూడా ఇటీవలి ఫ్లాప్‌ల తర్వాత వశిష్ట లాంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తో చేతులు కలపడం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: