నేషనల్ క్రష్ రష్మిక మందన తాజాగా తామ అనే హిందీ సినిమాలో నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను రష్మిక మందన పెద్ద ఎత్తున నిర్వహించింది. ఇక రష్మిక మందన ఈ సినిమా ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహించడం తో ఈ మూవీ తో ఈమె మంచి విజయాన్ని అందుకుంటుంది అని చాలా మంది భావించారు. ఈ సినిమాకు విడుదల అయిన తర్వాత పెద్దగా మంచి టాక్ రాలేదు.

దానితో ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర  వసూలు చేయడం కష్టం అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన 20 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రకారం ఈ సినిమాకు 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 206.1 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

ఇలా ఈ మూవీ.కి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర 20 రోజుల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్మిక కొన్ని హిందీ సినిమాలలో నటించింది. అందులో చావా సినిమా ఈమెకు మంచి విజయాన్ని , అద్భుతమైన గుర్తింపును తీసుకు వచ్చింది. తాజాగా ఈమె తామ సినిమాతో కూడా మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నట్లు తెలుస్తోంది. ఇలా రష్మిక హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి విజయాలను అందుకుంటూ అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rm