బాలీవుడ్ లెజెండర్ యాక్టర్ ధర్మేంద్ర చనిపోయినట్టు గత కొద్ది గంటల నుండి కొన్ని వార్తలు మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ధర్మేంద్ర కూతురు ఈషా డియోల్ తన తండ్రి చనిపోలేదని, తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది అని, తండ్రి చనిపోయినట్టు వచ్చిన వార్తలన్ని అవాస్తవమని కొట్టిపారేసింది. దీంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ధర్మేంద్ర అనారోగ్యం గురించి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒక షాకింగ్ విషయం వైరల్ అవుతుంది. అదేంటంటే ధర్మేంద్ర కి నలుగురు పిల్లలు ఉన్నా కూడా రెండో పెళ్లి చేసుకున్నారు.. మరి ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అనేది చూస్తే.. ధర్మేంద్ర మొదట ప్రకాష్ కౌర్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి సన్నీ డియోల్, బాబీ డియోల్,విజేత,అజేత అనే నలుగురు పిల్లలు ఉన్నారు.కానీ నలుగురు పిల్లలు పుట్టిన తరువాత కూడా ధర్మేంద్ర తనతో కలిసి సినిమాల్లో నటించిన హేమమాలినిని ప్రేమించారు.


అలా గతంలో ఎంతోమంది డ్రీమ్ గర్ల్ గా పేరొందిన హేమమాలిని చివరికి పెళ్లయి నలుగురు పిల్లలున్న ధర్మేంద్రని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అలా ధర్మేంద్ర కి రెండో భార్యగా వెళ్ళింది.ఇక ధర్మేంద్ర హేమమాలినీలకు ఈషా డియోల్, అహనా డియోల్ లు పుట్టారు. అయితే గతంలో హేమమాలిని ధర్మేంద్ర పెళ్లి చేసుకున్న సమయంలో ప్రకాష్ కౌర్ ఓ మ్యాగజిన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎవరైనా భర్త రెండో పెళ్లి చేసుకుంటే భర్తపై, ఆ పెళ్లి చేసుకున్న మహిళపై విమర్శలు చేస్తారు. కానీ దానికి భిన్నంగా ప్రకాష్ కౌర్ స్పందించింది.అందరూ నా భర్తను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. నా భర్త ఏమీ ఉమనైజర్ కాదు. నన్ను హేమమాలినిని పక్కపక్కన పెడితే ఏ మగాడైనా సరే హేమమాలినినే ఎంచుకుంటాడు.

ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది హీరోలకు ఎఫైర్లు ఉన్నాయి. చాలామంది రెండో పెళ్లి చేసుకుంటున్నారు.కానీ నా భర్తను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఆయన నన్ను వదిలేసినా కూడా ఆయన అంటే నాకు ఎప్పటికీ గౌరవమే ఉంది. ఆయన ఒక గొప్ప భర్త కాకపోయినప్పటికీ గొప్ప తండ్రిగా నా పిల్లలకు అన్ని ఇచ్చారు. ఇక హేమమాలిని ప్రేమ గురించి నేను అర్థం చేసుకున్నా. ప్రేమలో ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు.కానీ ఒక తల్లిగా భార్యగా మాత్రం ఆమె నిర్ణయాలని నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను.ఒకవేళ నేను హేమమాలిని స్థానంలో ఉంటే కచ్చితంగా అలాంటి పని చేసేదాన్ని కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అలా ధర్మేంద్ర అనారోగ్య వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వేళ ఆయన రెండో పెళ్లి గురించి ఈ విషయం మరోసారి వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: