కానీ కుటుంబ సభ్యులు మాత్రం ధర్మేంద్ర మరణించలేదంటూ తెలియజేయడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ధర్మేంద్ర కూతురు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. మీడియా కంగారుపడి ఫాల్స్ న్యూస్ ని వైరల్ గా చేసింది. మా నాన్న ఆరోగ్యం బాగానే ఉంది, ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారు.. అందరూ కూడా మా కుటుంబానికి కొంత ప్రైవసీని ఇవ్వాలి అంటూ ఒక నోట్ ను విడుదల చేసింది. మా నాన్నగారు త్వరగా కోలుకోవడానికి ప్రార్థిస్తున్న అందరికీ కూడా థాంక్స్ అంటూ తెలియజేసింది ఈషా డియోల్. ఈ విషయం తెలిసి అభిమానులు కూడా ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం ధర్మేంద్రను వెంటిలేటర్ సపోర్టు మీద ఉంచినట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన మరణానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరు కూడా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. ధర్మేంద్ర టీమ్ ఒకటి చెబుతూ ఉండగా, కుటుంబ సభ్యులు మరొకటి తెలియజేస్తున్నారు . ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దేవ్ ఆధ్వర్యంలోనే చికిత్స తీసుకుంటున్నట్లు ధర్మేంద్ర బాలీవుడ్లో వినిపిస్తున్నాయి. హీరో ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు ఒకరు ప్రకాష్ కౌర్, మరొకరు హేమమాలిని. బాలీవుడ్లో నటులుగా పేరు సంపాదించిన సన్నీడియోల్, బాబీ డియోల్ మొదటి భార్య సంతానం. ధర్మేంద్ర మరణం పైన హేమమాలిని కూడా ఫైర్ అయ్యింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి