ఇదిలా ఉంటే, తాజాగా "ఇరువురి భామల కౌగిలిలో" మూవీ పూజా కార్యక్రమానికి గెస్ట్‌గా వెళ్లిన నిహారికకు చేదు అనుభవం ఎదురైంది. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అదే కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు రాఘవేంద్రరావుతో.. నిహారిక మాట్లాడుతుండగా, ఆయన ఉన్నట్లుండి ఆమె నడుముపై చేయి వేసి దగ్గరకు లాక్కున్నట్టుగా కనిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో చాలా అసౌకర్యంగా ఫీల్ అయిన నిహారిక వెంటనే ఆయన కుర్చీ వెనక్కి వెళ్లి మాట్లాడింది. వీడియోలో ఆమె ఇబ్బంది పడినట్టు స్పష్టంగా కనిపించడంతో నెటిజన్లు షాక్ అవుతూ విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియో జెట్ స్పీడ్ లో వైరల్ అవుతుంది.
ఒక నెటిజన్ “నెక్స్ట్ మూవీలో పనసపండుతో కొట్టాలనుకున్నాడేమో” అంటూ కామెంట్ చేయగా, మరొకరు “చిన్నప్పటి నుంచి ఆయన చేతిలో పెరిగింది కాబట్టి ఆప్యాయతతో అలా చేసి ఉండొచ్చు” అన్నారు. కానీ ఓ ఆడపిల్ల ని ఒక వయసు వచ్చాక సొంత నాన్న అయినా సరే అలా నడుము మీద చెయ్యి వేయకూడదు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అంటూ మండిపడుతున్నారు జనాలు. దీని పై నీహారిక ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి