సోషల్ మీడియా వేదికగా ధర్మేంద్ర భార్య హేమా మాలిని స్పందిస్తూ.. తన భర్త పైన ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం ఏమాత్రం క్షమించరాని తప్పు.. బాధ్యత కలిగిన ఛానల్స్ బతికి ఉండి చికిత్సకు స్పందిస్తున్న ఒక వ్యక్తి చనిపోయాడు అంటూ ఎలా ప్రచారం చేయగలవు? అని ఆమె ప్రశ్నించింది. ఇది కచ్చితంగా ఆ గౌరపరచడమే , ఇర్రెరెస్పాన్సిబుల్గా వ్యవహరించడమే అంటూ ఫైర్ అయ్యింది. ధర్మేంద్ర ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగానే ఉన్నదని అభిమానులు నమ్మకంగా ఉండాలంటూ కోరింది. అంతేకాకుండా దయచేసి మా కుటుంబానికి కొంత గౌరవం ఇవ్వండి ,అలాగే కొంత ప్రైవసీ ఇవ్వండి అంటూ తెలియజేశారు.
బాలీవుడ్ లో ధర్మేంద్ర మరణించారంటూ పలు రకాల వార్తలు మీడియాలలో ఎక్కువగా వినిపించాయి. దీంతో దేశవ్యాప్తంగా ధర్మేంద్ర మరణించారనే విషయం వైరల్ గా మారింది. ఈ విషయాల పైన అటు కూతురు , ధర్మేంద్ర భార్య ఇద్దరు క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఊపిరిపించుకున్నారు. మరి ఈ విషయం పైన ఇకనైనా రూమర్స్ ఆగుతాయేమో చూడాలి మరి. హేమా మాలిని ట్వీట్ తో తప్పుడు ప్రచారాలకు స్వస్తి చెప్పినట్టుగా కనిపిస్తోందని పలువురు నెట్టిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి