కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ బాబు అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకొని స్టార్ హీరోలతో సరి సమానంగా కెరియర్ను ముందుకు సాగించాడు. కానీ ఆ తర్వాత మాత్రం మోహన్ బాబు ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో వెనుకబడ్డాడు. దానితో ఆయనతో సరి సమాన స్థాయిలో కేరిర్ను కొనసాగించిన హీరోలతో పోలిస్తే మోహన్ బాబు క్రేజ్ కాస్త తగ్గింది. ఇకపోతే మోహన్ బాబు కేవలం సినిమాల్లో హీరో పాత్రలో మాత్రమే కాకుండా అనేక ఇతర పాత్రల్లో కూడా నటించాడు.

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. మోహన్ బాబు ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మోహన్ బాబు కోసం ఈ మూవీ యూనిట్ ఒక అత్యంత విలాసవంతమైన భారీ సెట్ ను అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.  ది ప్యారడైజ్ మూవీ బృందం వారు మోహన్ బాబు కోసం దాదాపు 7 నుండి మరియు 7. 50 కోట్ల ఖర్చుతో ఈ సెట్ ను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నాని , శ్రీకాంత్ కాంబోలో రూపొందిన దసరా సినిమా అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో వీరి కాంబోలో రూపొందుతున్న రెండవ సినిమా అయినటువంటి ది ప్యారడైజ్ మూవీపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ మూవీ నుండి మేకల్స్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమాతో నాని , శ్రీకాంత్ కి ఏ స్థాయి విజయం దక్కుతుందో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: