కానీ ఆ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగానే ఒక భారీ ట్విస్ట్! రామ్ గోపాల్ వర్మకు అదే సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నుండి సినిమా ఆఫర్ వచ్చింది. బిగ్ బీతో సినిమా చేయడానికి అవకాశం దొరకడంతో, వర్మ ఎన్టీఆర్ సినిమా కొంతకాలం వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు. బాలీవుడ్ వైపు మలుపు తీసుకున్న వర్మ .. వర్మ ఆ సమయంలో అమితాబ్‌తో “సర్కార్”, “నిషబ్ద్” వంటి ప్రాజెక్ట్‌లపై బిజీ అయ్యాడు. బాలీవుడ్ ఆఫర్లు వరుసగా రావడంతో, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పూర్తిగా పక్కన పడిపోయింది. తారక్ కూడా ఆ సమయంలో ఇతర డైరెక్టర్లతో వరుస సినిమాలు ప్రారంభించడంతో, RGV – ntr కలయికలో రాబోయే సినిమా అలా మిస్ అయిపోయింది. ఆ సినిమా వచ్చి ఉంటే ఎలా ఉండేదో అని ఫ్యాన్స్ ఇప్పటికీ ఊహించుకుంటున్నారు. అభిమానుల ఊహల్లో ఆ మిస్ అయిన మాస్టర్‌పీస్..
ఫ్యాన్స్ అభిప్రాయం ఏమిటంటే – ఎన్టీఆర్ యొక్క ఫైర్ ఎనర్జీ, వర్మ యొక్క ఇంటెన్స్ టేకింగ్, “శివ” తరహా రియలిస్టిక్ ప్రెజెంటేషన్‌తో ఆ సినిమా మాస్ హిస్టరీ క్రియేట్ చేసేదని. ఆర్జీవీ ‘శివ’తో నాగార్జున కెరీర్ మలుపు తిప్పినట్టే, తారక్‌తో చేసినా మరో కల్ట్ క్లాసిక్ జన్మించి ఉండేదని అభిమానులు చెబుతున్నారు. ప్రస్తుతం తారక్ పాన్ ఇండియా ఫోకస్‌లో! .. ఇప్పుడంటే జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ‘RRR’ తర్వాత ఆయన దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఆ తర్వాత ‘దేవర’ పార్ట్ 2 షూట్‌లో పాల్గొనబోతున్నాడు. ఇక బాలీవుడ్ డైరెక్టర్లు కూడా తారక్‌తో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ నిజమై ఉండి ఉంటే, టాలీవుడ్ మాస్ రికార్డ్స్ అన్నీ రీ-రైటయ్యేవి అనడంలో ఎటువంటి సందేహం లేదు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి