మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మల్లాడి వశిష్ట దర్శకత్వం వహిస్తూ ఉండగా ... త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితం స్టార్ట్ అయింది. కానీ ఈ మూవీ లో అత్యంత భారీ వి ఎఫ్ ఏక్స్ ఉండటంతో ఈ సినిమా షూటింగ్ అత్యంత డిలే అవుతూ వస్తుంది. కొంత కాలం క్రితం చిరంజీవి ఈ సినిమాను వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ వీడియోను విడుదల చేశాడు.

చిరంజీవి "విశ్వంభర" సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత చాలా రోజులకు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ మూవీ లో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల చివరి వరకు ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా కాలం క్రితమే ప్రకటించారు.

చిరంజీవి తన నెక్స్ట్ మూవీ ని బాబి కొల్లి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ చిరంజీవి కెరియర్ లో 158 వ మూవీ గా రూపొందబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల అయ్యి కూడా ఇప్పటికే చాలా కాలం అవుతుంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్లుగా లూకా , కూరూప్ లను సినిమాటో గ్రాఫర్ గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిరు , బాబీ కాంబోలో రూపొందిన వాల్టేర్ వీరయ్య  మంచి విజయం సాధించడంతో వీరి కాంబోలో రెండవ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: