తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం జన నాయగన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. పూజ హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... హెచ్ వినోద్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఒక సాంగ్ను విడుదల చేశారు. ఆ సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. విజయ్ కొంత కాలం క్రితం ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మనకు తెలిసిందే. కొంత కాలం క్రితం విజయ్ "జన నాయగన్" మూవీనే నా చివరి సినిమా అని , ఆ మూవీ పూర్తి అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటాను అని , కేవలం రాజకీయాల్లోనే చురుగ్గా ఉంటాను అని చెప్పుకోచ్చాడు. దానితో ఈ సినిమానే విజయ్ కెరియర్లో లాస్ట్ మూవీ అయ్యే అవకాశం ఉంది.

దానితో విజయ్ అభిమానులు కచ్చితంగా జన నాయగన్ అనే మూవీ తో విజయ్ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకోవాలి అని భావిస్తున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ రివ్యూ వైరల్ అవుతుంది. ఆ రివ్యూ ప్రకారం ఈ మూవీ యొక్క మొదటి సగభాగం అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతున్నట్లు , రెండవ సాగ భాగంలో ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నట్లు , ఇలా ఈ మూవీ లోని మొదటి భాగం ఎంటర్టైన్ గా , రెండవ భాగం ఎమోషనల్ గా ఉండబోతున్నట్లు , ఓవరాల్ గా ఈ సినిమా ఒక అద్భుతమైన విజయం సాధించే కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూవీ సూపర్ సూపర్ సాలిడ్ గా ఉండబోతున్నట్లు ఓ రివ్యూ వైరల్ అవుతూ ఉండడంతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: