అనుకోని పరిస్థితుల వల్ల తలైవర్ 173 మూవీ నుంచి తాను తప్పుకుంటున్నానని అయినా సరే రజినీకాంత్, కమలహాసన్ తో తనకి ఉన్న అనుబంధాన్ని అలాగే కొనసాగిస్తానంటూ తెలిపారు. గడచిన కొద్ది రోజులుగా వాళ్లతో గడిపిన క్షణాలను సైతం తాను జీవితాంతం గుర్తుంచుకుంటారు అంటూ సుందర్ సి తెలియజేశారు. డైరెక్టర్ సుందర్ మాత్రం ఎందుకు బయటకు వచ్చారనే విషయాన్ని నోట్ లో తెలుపలేదు. ఇకపోతే రజనీకాంత్, కమలహాసన్ కాంబినేషన్ అనగానే చాలామంది ఇందులో ఇతరు నటిస్తారనుకున్నారు. కానీ ఇందులో హీరోగా రజనీకాంత్, నిర్మాతగా కమల్ హాసన్ గా మాత్రమే ఉండబోతున్నారు.
గతంలో రజనీకాంత్ కి అరుణాచలం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన డైరెక్టర్ సుందర్ రీసెంట్ టైంలో కూడా ఎక్కువగా హర్రర్ సినిమాలనే తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే రజినీకాంత్, కమలహాసన్ అవకాశం ఇవ్వడంతో అనౌన్స్మెంట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు సుందర్ స్వచ్ఛందంగా ఈ కాంబినేషన్ నుంచి తప్పుకోవడంతో ఈ డైరెక్టర్ స్థానంలో కొత్త డైరెక్టర్ ఎవరు వస్తారా? అనే విషయంపై అభిమానులు ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుందర్ నోట్ ని విడుదల చేయగా భార్య ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఏమైందో తెలియదు కానీ మళ్ళీ వెంటనే డిలీట్ చేసినట్లుగా సమాచారం. మరి సుందర్ దర్శకత్వం నుంచి తప్పుకోవడం పై క్లారిటీ ఇస్తారమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి