నేషనల్ క్రష్ రష్మిక మందన తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన తర్వాత పర్వాలేదు అనే టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ను అందుకున్న కూడా దానికి కాస్త ఎక్కువ రోజులు పడుతుంది అని కొంత మంది అనుకున్నారు.

కానీ ఈ మూవీ చాలా త్వరగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంది. అలాగే భారీ లాభాలను కూడా ఇప్పటికే అందుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఏడు రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 2.80 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 62 లక్షలు , ఆంధ్ర లో 2.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఏడు రోజుల్లో ఈ మూవీ కి 5.72 కోట్ల షేర్ ... 10.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఏడు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 3.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఏడు రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 10.07 కోట్ల షేర్ ... 19.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా దాదాపు ఏడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఇప్పటికే ఈ సినిమా మూడు కోట్లకు పైగా లాభాలను అందుకొని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm