మహేష్ బాబు,రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ తాజాగా రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ ఈవెంట్ కి భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే ఎస్ఎస్ఎంబి 29 మూవీకి ముందు నుండి అందరూ అనుకుంటున్నట్లు గానే వారణాసి అనే మూవీ టైటిల్ ని ఫిక్స్ చేసి అధికారికంగా స్క్రీన్ పై ఈ టైటిల్ ని రిలీజ్ చేశారు.అలాగే అన్నింటికంటే స్పెషల్ అట్రాక్షన్ గా స్క్రీన్ పై మహేష్ బాబు ఎంట్రీ అదుర్స్ అనిపించేలా అద్భుతంగా ఉంది.ఇందులో మహేష్ బాబు ఎంట్రీ లోనే నందిపై కూర్చొని శివుడు ఎలా అయితే వస్తారో అచ్చం అలాగే మహేష్ బాబు ఎంట్రీని చూపించారు.ఇందులో మహేష్ బాబు ఎద్దుపై కూర్చొని ఎంట్రీ ఇచ్చారు.. 

అలా ఎద్దుపై కూర్చొని చేతిలో త్రిశూలం పట్టుకొని వచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.అలా ఫైనల్ గా వారణాసి అనే మూవీ టైటిల్ తో పాటు మహేష్ బాబు కి సంబంధించిన గ్లింప్స్  ని కూడా విడుదల చేయడంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఈవెంట్ కి వందలాదిమంది పాసులు తీసుకుని వెళ్లడంతో పాటు జియో హాట్స్టార్ లో లక్షలాదిమంది ఈవెంట్ ని వీక్షిస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన గ్లింప్స్, పాత్రల పేర్లను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా పూర్తిగా దైవత్వంతో ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

 ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రివీల్ చేశారు.అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా మందాకిని అనే పాత్రలో నటిస్తోంది. రీసెంట్ గానే చీర కట్టుకొని చేతిలో గన్ పట్టుకొని ఉన్న ప్రియాంక చోప్రా పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.అలా ఫైనల్ గా ఈరోజు జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో మహేష్ బాబు ఫస్ట్ లుక్ వీడియోని రివీల్ చేయడంతో పాటు ఆయన రుద్ర పాత్రలో నటిస్తున్నట్టు అంతేకాకుండా వారణాసి అనే సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: