మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమాపై చాలా రోజుల నుండి భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ అంచనాలకు తగ్గట్టుగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లోబ్ ట్రాటర్ అనే ఈవెంట్ ఏర్పాటు చేసి సినిమా టైటిల్ మహేష్ బాబు కి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదల చేశారు.రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్న ఈ ఈవెంట్ కి ఇప్పటికే చిత్ర యూనిట్ అందరూ హాజరయ్యారు.అలా సినిమా నిర్మాతలు హీరో హీరోయిన్ మిగతా తారాగణం అందరూ అక్కడికి హాజరయ్యారు. అయితే ఈ సినిమాకి కేల్ నారాయణ తో పాటు రాజమౌళి తనయుడు కార్తీకేయ కూడా నిర్మాతగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో కార్తికేయ మాట్లాడుతూ.. ఇంత పెద్ద సినిమాలో నాకు అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఈ సినిమా చేసిన వారందరూ గొప్ప లెజెండ్స్..

 భారతీయ సినిమాలను గ్లోబల్ వైపు తీసుకెళ్లడంతో పాటు గ్లోబల్ ఆడియన్స్ ని ఇండియన్ సినిమాల వైపు చూసేలా చేస్తున్నాం. ఇలాంటి లెజెండ్స్ తో కలిసి వర్క్ చేయడం నా అదృష్టం.. ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు కేల్ నారాయణ గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా ఈవెంట్  హైదరాబాద్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కాంబినేషన్ కోసం 15 ఏళ్ల పాటు కేల్ నారాయణ వేచి చూశారు అంటూ కార్తికేయ మాట్లాడారు. అయితే కార్తికేయ మాటలు చూసి ఆయన తల్లి రమా రాజమౌళి ఎమోషనల్ అయింది.

ప్రస్తుతం కొడుకు మాటలకి రాజమౌళి భార్య ఎమోషనల్ అయినా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే ఇదే ఈవెంట్లో సినిమాకి మరో నిర్మాత అయినటువంటి కేఎల్ నారాయణ మాట్లాడుతూ..రాజమౌళి గారిని 15 ఏళ్ల క్రితం కలిసి సినిమా చేద్దామని అడిగా. ఆ టైంలో ఆయన వెంటనే ఒప్పుకున్నారు. కానీ సినిమా పట్టాలెక్కడానికి ఇన్ని రోజుల సమయం పట్టింది.ఈ టైంలోనే రాజమౌళికి ఈగ, ఆర్ఆర్ఆర్,బాహుబలి వంటి ఎన్నో హిట్ సినిమాలు పడ్డాయి. ఇప్పుడు ఆయన డైరెక్టర్ గా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. 15 ఏళ్ల క్రితం తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రాజమౌళి గారికి థాంక్స్ అంటూ కేల్ నారాయణ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: