ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పాన్-ఇండియా నటుడు పృధ్వీ రాజ్ సుకుమారన్ శక్తివంతమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. వీరి కాంబినేషన్‌నే చూసినా ఈ చిత్రం ఎంత భారీగా తెరకెక్కుతోందో స్పష్టంగా తెలుస్తోంది.ఇంకా మరొక విశేషం ఏమంటే—ఈ మ్యాగ్నమ్ ఓపస్‌ను కేవలం నిర్మాత కేఎల్ నారాయణ మాత్రమే కాకుండా, రాజమౌళి–రమాల దంపతుల కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు చిన్న, మధ్యస్థ సినిమాలు నిర్మించిన కార్తికేయకు ఇది కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా. ఇలాంటి హిస్టారికల్ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా నిలవడం ఆయనకు మైలురాయిగా మారింది.
కీరవాణి గారి పవర్‌ఫుల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్!
గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. సినిమాకు సంబంధించిన కీలక విషయాలను పంచుకున్న ఆయన, తనదైన హాస్యంతో పాటు భావోద్వేగాన్ని కలిపి అభిమానులను మంత్రముగ్ధులను చేశారు. ప్రత్యేకంగా మహేష్ బాబు కెరీర్‌లో సంచలనం సృష్టించిన ‘పోకిరి’ సినిమా డైలాగ్‌ను స్టేజ్ మీద అద్భుతంగా రీక్రియేట్ చేస్తూ— “నేను ఒక ఫ్లాట్ కొన్నా… అది ఇసుకతో కాదు, సిమెంట్‌తో కాదు… మహేష్ బాబు గుండెల్లో, మహేష్ అభిమానుల గుండెల్లో!”అని తనదైన స్టైల్‌లో చెప్పి స్టేజ్ మొత్తం ఊర్రూతలూగించారు.
అదే ఫ్లోలో ఆయన మరో సర్‌ప్రైజ్ ఇచ్చేశారు.“2027లో ‘వారణాసి’ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. దాన్ని చూసిన ప్రేక్షకులు అపారమైన ఆనందాన్ని పొందబోతున్నారు” అని చెప్పడంతో స్టేజ్ దగ్గరున్న అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. ఈ చిత్రం తెరకెక్కడానికి సాధారణంగా 3–4 సంవత్సరాల సమయం పడుతుందని అందరూ భావించినా, అతిపెద్ద ఆశ్చర్యంగా సినిమా రిలీజ్ డేట్‌ను ముందుగానే ప్రకటించారు కీరవాణి. కీరవాణి గారి ఈ భావోద్వేగపూరిత, ఎనర్జిటిక్ స్పీచ్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజమౌళి సినిమాలు ఎంత సమయం తీసుకున్నా, ఫలితం మాత్రం హిస్టరీనే అవుతుందని అందరూ చెప్పుకుంటుండగా—2027 రిలీజ్ అనౌన్స్ చేయడం మహేష్ బాబు ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్‌గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి