బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా , టాలీవుడ్ హీరో మహేష్ బాబు , డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి(SSMB 29)సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ రోజున గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో భాగంగా హాజరైన ప్రియాంక చోప్రా తన మాటలతో అందరినీ ఆకట్టుకుంది. ఇలాంటి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతల పై ప్రశంసలు కురిపించింది ప్రియాంక చోప్రా. ఆ తర్వాత మహేష్ బాబు గురించి మాట్లాడుతూ.మహేష్ బాబు,నమ్రత, సితార క్యూట్ ఫ్యామిలీ కలిసి హైదరాబాదును నాకు సొంత ఇంటిలా మార్చేశారని తెలిపింది.



ఇప్పటికీ నేను మహేష్ అభిమానుల మధ్య నిలబడి ఉన్నాను.. ఈ ఫ్యాన్స్ మధ్య చూస్తూ ఉంటే నేను ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను అంటూ పోకిరి సినిమాలోని డైలాగ్ చెప్పగా.. అయితే తనకి తెలుగు కొంచెం కొంచెమే వచ్చని ఈ సినిమా షూటింగ్ అయిపోయేలోపు కచ్చితంగా పూర్తిగా తెలుగు నేర్చుకొని సినిమా డైలాగు చెబుతానంటూ స్టేజి మీద హామీ ఇచ్చింది ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా చేసిన ఈ కామెంట్స్ కి సైతం ఫాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇందులో తన పాత్ర కూడా హైలెట్ గానే ఉంటుందంటూ తెలియజేసింది ప్రియాంక.


ప్రతి ఒక్కరు కూడా వారణాసి గ్లింప్స్ కోసమే ఎదురుచూస్తున్నారు.. నేను కూడా మీలాగే ఎదురుచూస్తున్నానంటూ తెలియజేసింది ప్రియాంక చోప్రా. ఈ సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి మీతో పాటు నేను కూడా చాలా ఎగ్జిట్గానే ఎదురు చూస్తున్నాను అంటే తెలియజేశారు ప్రియాంక చోప్రా. ఇక మందాకిని పాత్ర గురించి యాంకర్ సుమ కూడా ప్రశంసించింది. ఇక రాజమౌళి కూడా ఈవెంట్ గురించి మాట్లాడుతూ ఈవెంట్ కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు రాజమౌళి. మరి ప్రియాంక చోప్రా ఇచ్చిన మాట ప్రకారం తెలుగులో డైలాగ్ చెబుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: