ఆ ఎల్ఈడి స్క్రీన్ లకు పవర్ అందించడానికి సుమారుగా 45 జనరేటర్లు బయట ఏర్పాటు చేశాము. అయితే ఇదంతా టెస్ట్ చేయడం కోసం ప్లాన్ చేసుకున్నాను. నిన్నటి రోజున రాత్రి టెస్టింగ్ కోసమని వీడియోని ప్లే చేద్దామనుకున్నాను.పైగా లీక్ అవ్వకూడదని పెద్ద పెద్ద క్రేన్లు, బ్లాక్ క్లాత్ అడ్డుపెట్టి, అర్ధరాత్రి వరకు పనిచేసి టెస్ట్ చేద్దామని అనుకున్నప్పటికీ కానీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు డ్రోన్ కెమెరాస్ వచ్చాయి. డ్రోన్ తో ఆ వీడియోలను తీసి సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టారు.
అలా చేయడం తప్పు.. మా ఏడాది కష్టాన్ని వృధా చేయడం అవుతుంది. వేలమంది కార్మికులు పనిచేశారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసాము, ఈ ఈవెంట్ కోసం రాత్రి పగలు కూడా చాలామంది పనిచేసారు. ఇంత చేసినప్పటికీ కేవలం డ్రోన్ కెమెరాల సహాయంతో లీక్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మా వీడియోని మేము టెస్ట్ చేసుకోవడానికి కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారంటూ రాజమౌళి తెలియజేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని అంత కష్టపడి చేస్తే .. టెస్ట్ చేస్తే ఎక్కడ లీక్ అవుతుందనే భయం మొదలయ్యిందంటూ" రాజమౌళి తెలిపారు. ఆడియన్స్ అంత దూరం నుంచి కష్టపడి వచ్చారు. అనుకున్నట్టుగానే చూపించాలని డైరెక్ట్ గాని ప్లే చేద్దామని రిస్కు తీసుకున్నాను అంటూ తెలిపారు రాజమౌళి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి