ఒక సినిమా లో ఒక హీరోతో కలిసి వర్క్ చేస్తున్నారంటే ఆ డైరెక్టర్ పూర్తిగా హీరో గురించి ఎంతో తెలుసుకుంటారు. అలా తాజాగా మహేష్ బాబుతో కలిసి సినిమా చేస్తున్న రాజమౌళి మహేష్ బాబుని పూర్తిగా అధ్యయనం చేసినట్టే కనిపిస్తున్నారు. ఎందుకంటే తాజాగా గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో మహేష్ బాబు గురించి రాజమౌళి చేసిన కామెంట్లు ఆ విధంగా ఉన్నాయి. తాజాగా రామోజీ ఫిలిం సిటీ లో మహేష్ బాబు రాజమౌళి ల మూవీకి సంబంధించిన ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో వారణాసి అనే సినిమా పేరుతో పాటు మహేష్ బాబు గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్లో మహేష్ బాబుకి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రాజమౌళి. ఆయన ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ.. మహేష్ బాబు ది చాలా మంచి వ్యక్తిత్వం.ఆయన నుండి మనం ఈ విషయాన్ని కచ్చితంగా నేర్చుకోవాల్సిందే.

ఎందుకంటే ఆయన వన్స్ సినిమా షూటింగ్స్ సెట్లోకి అడుగు పెట్టారంటే చాలు ఆయన చేతిలో ఫోన్ అస్సలు ఉండదు. షూటింగ్ సెట్ కి వచ్చే ముందే కారులోనే తన ఫోన్ ని పెట్టుకొని వస్తాడు. షూటింగ్ ఎన్ని గంటలు ఉన్నా సరే ఫోన్ ని అస్సలు ముట్టుకోరు. షూటింగ్ మొత్తం పూర్తయ్యాకే మళ్ళీ కారు ఎక్కినప్పుడు ఆయన ఫోన్ ని ముట్టుకుంటారు. మనలో ఉన్న చాలా మందికి ఫోన్ అడిక్షన్ అనేది ఉంటుంది.ఉదయం లేస్తే చాలు ఫోన్ పట్టుకొని గంటలు గంటలు గడుపుతాం.కానీ మహేష్ బాబు మాత్రం ఒక్కసారి షూటింగ్ సెట్లోకి అడుగుపెడితే తన ఫోన్ వైపు అస్సలు చూడరు. షూటింగ్ పూర్తయ్యాకే మళ్లీ ఫోన్ చూస్తారు. ఈ విషయంలో మహేష్ బాబుని మెచ్చుకోవాల్సిందే. అంతే కాదు మహేష్ బాబు నుండి ఈ క్వాలిటీని మనమందరం నేర్చుకోవాలి.

మనమందరం మహేష్ బాబు ని చూసి పాటించాల్సిన ఒక గొప్ప క్వాలిటీ ఇది అంటూ రాజమౌళి మహేష్ బాబుని ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడారు. అంతేకాదు ఇదే ఈవెంట్లో నేను కూడా మీలాగే ఫోన్ కి వీలైనంత వరకు దూరంగా ఉండడానికి ట్రై చేస్తాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలా రాజమౌళి మహేష్ బాబుకి సంబంధించిన ఈ విషయాన్ని బయట పెట్టడంతో చాలామంది ఫోన్ లేకుండా కనీసం బాత్ రూమ్ కి కూడా వెళ్లలేని పరిస్థితులు ఉన్న సమాజంలో బతుకుతున్నాం. అలాంటిది మీరు షూటింగ్లో ఎన్ని గంటలు ఉన్నా ఫోన్ చూడరంటే నిజంగా గ్రేట్ సార్ అంటూ మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: