టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్లలో రాజమౌళి ముందు స్థానంలో ఉంటారు.. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీని చాలా చులకన భావంతో చూసే సమయంలో టాలెంట్ ఉన్న దర్శకులు,హీరోలు ఉంటారని నిరూపించిన ఏకైక దర్శకుడు రాజమౌళి.. బాహుబలి తో తెలుగు సినిమా ఖ్యాతిని  ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన గొప్ప డైరెక్టర్ అని చెప్పవచ్చు.. ఎంతటి గొప్ప వారైనా సరే ఏదో ఒక దగ్గర చిన్న తప్పు చేస్తూ ఉంటారు.. ఆ విధంగానే రాజమౌళి కూడా దేవుళ్లపై సినిమాలు చేస్తూ  దేవుడినే కాస్త అవమానించేలా  మాట్లాడడం ఏంటని కొంతమంది హిందూ భక్తులు  ఫైర్ అవుతున్నారు. ఇంతకీ రాజమౌళి ఏమన్నారు.. ఆయనపై హిందూ బాంధవులు ఎందుకు కోపానికి వస్తున్నారు అనేది చూద్దాం.. రాజమౌళి ఏదైనా ప్రాజెక్టు చేశారంటే తప్పకుండా అది బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. 

అంతే కాదు అందులో నటించిన నటీనటుల అందరికీ ఎంతో పేరు వస్తుంది.. అయితే ఆయన బాహుబలి,ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబు తో మరో సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి  పేరును తాజాగా హైదరాబాదులో ఓ ఈవెంట్ పెట్టి ప్రకటించారు. ఒక పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేసి వారణాసి అనే సినిమా టైటిల్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సినిమాకు సంబంధించిన పెద్ద పెద్ద ప్రముఖులు కూడా వచ్చారు. ఈ క్రమంలోనే సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. సినిమా వీడియో చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఇది రాజమౌళి తీస్తున్నారా అని.. అంతేకాదు ఆయన వెనుక హనుమాన్  ఉండి నడిపిస్తున్నాడు అంటూ మాట్లాడారు.

 ఈ విధంగా రాజమౌళిని దేవుడి పేరుతో, పొగిడిన తర్వాత రాజమౌళి మాట్లాడుతూ.. టెక్నికల్ ప్రాబ్లం వల్ల  గ్లింప్స్ ఆలస్యమయ్యాయని అన్నారు. నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదని, మా నాన్న నా వెనక హనుమాన్ ఉంటాడని చెప్పడం నాకు పెద్దగా నచ్చలేదంటూ మాట్లాడారు. ఈ మాట విన్నటువంటి హిందూ బాంధవులు రాజమౌళి పై విరుచుకుపడుతున్నారు. ఇంత చిన్న సమస్యకు దేవుడిని అనడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు. నీకు దేవుడు నచ్చకపోతే సైలెంట్ గా ఉండు కానీ దేవుడిపై నమ్మకం లేదు అంటూ మాట్లాడడం పద్ధతి కాదంటూ కామెంట్లతో ఏకీపారేస్తున్నారు. మరి దీనిపై రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: