అంతేకాక, సమంత త్వరలో విడుదల కానున్న ‘రక్త బ్రహ్మాండ’ వెబ్ సిరీస్ ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో ఆమె నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్ ’ అమెజాన్ ప్రైమ్‌లో సూపర్ సక్సెస్ సాధించడంతో, ఆ సిరీస్ గురించిన ఆనందాన్ని కూడా ఆమె పంచుకుంది. ఈ సక్సెస్‌లు సమంతలో మరోసారి కొత్త ఎనర్జీ నింపినట్లు తెలుస్తోంది.ఇక తాజాగా, సమంత తన ఫిట్‌నెస్ జర్నీ గురించి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. “బీస్ట్ మోడ్… ఫుల్ యాక్షన్ మోడ్!” అంటూ తన ట్రాన్స్ఫర్మేషన్ ఫోటోల్ని షేర్ చేసిన ఆమె, గతంలో తన వెన్నెముక బలహీనత విషయంలో తానే నిర్లక్ష్యం వహించానని నిజాయితీగా ఒప్పుకుంది.
ఆమె పోస్ట్‌లో ..“దీర్ఘకాలం శరీరం మీద శ్రద్ధ పెట్టకుండా ఉండటం, ముఖ్యంగా వెన్నెముక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం పూర్తిగా నా తప్పే.కొన్ని రోజులు ఫలితం కనిపించదు. ఆ రోజుల్లో వర్కౌట్‌కు రావడం చాలా కష్టమే. వదిలేయాలనిపించినా ఆగకుండా కొనసాగితేనే అసలు మార్పు వస్తుంది.”
“స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వయస్సు పెరిగేకొద్దీ ఎంత అవసరమో ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. ఇది నాకు ఓర్పు, క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ అన్నీ నేర్పింది.”“‘జీన్స్ కారణం’ అనే మాట ఒక సాకు మాత్రమే. నిజమైన మార్పు మన క్రమశిక్షణలోనే ఉంటుంది.”సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ ఆమె ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇన్‌స్పిరేషన్‌గా మారింది. మయోసైటిస్‌తో ఎదురైన కష్టాలను అధిగమించి, మళ్లీ స్ట్రాంగ్‌గా తిరిగివచ్చిన ఆమె జర్నీ ఇప్పుడు అందరికీ ఒక రోల్ మోడల్‌గా నిలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి