రవితేజ:
సినిమాల్లోకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. లైట్ బాయ్ గా కొనసాగిన ఆయన ప్రస్థానం మాస్ మహారాజ్ స్టేజ్ వరకు వచ్చిందంటే ఇడియట్,అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, భద్ర వంటి సినిమాలు ఈయన కెరీయర్ ని మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. అలా మాస్ మహారాజాగా ఇమేజ్ సంపాదించుకొని ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన రవితేజ ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. ఆయన చేసిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆదరించడం లేదు. అలా వరుసగా రాజా ది గ్రేట్ సినిమా తర్వాత టచ్ చేసి చూడు, డిస్కో రాజా, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. ఆ తర్వాత వచ్చిన క్రాక్ సినిమా రవితేజ ని మళ్ళీ కం బ్యాక్ చేసినప్పటికీ ఈ సినిమా తర్వాత చేసిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు రవితేజ ఫ్యాన్స్ కి ఊరట కలిగించినప్పటికీ మళ్లీ ఈగల్ రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో షూటింగ్లో బిజీగా ఉన్నారు.ఇక ఈ సినిమా హిట్ అయితేనే రవితేజ కెరీర్ ముందుకు సాగుతుంది లేకపోతే కష్టమే.
నితిన్:
జయం సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన నితిన్ సై,దిల్,గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్ వంటి సినిమాలు చేసి యూత్ లో పేరు తెచ్చుకున్న ఈయన అఆ, భీష్మ సినిమాల తర్వాత చేసిన ఏ సినిమాలు కూడా హిట్ కొట్టలేదు.దాంతో వరుసగా భారీ ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు.
గోపీచంద్ :
హీరోగా.. విలన్ గా.. ఇండస్ట్రీలో రాణించిన గోపీచంద్ ఒకప్పుడు చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే. కానీ ఈ మధ్యకాలంలో ఆయన నటించిన లౌక్యం సినిమా తర్వాత చేసిన సినిమాలేవి అనుకున్నంత మేర ఫలితం అందించలేదు. దాంతో గోపీచంద్ మళ్లీ విలన్ అవతారం ఎత్తబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వచ్చే ఏడాది సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమాతో మన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కూడా దెబ్బ కొడితే ఇక గోపీచంద్ కెరియర్ కి పుల్ స్టాప్ పడుతుందని కొంతమంది అంటున్నారు.
అల్లరి నరేష్:
అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇవివి సత్యనారాయణ తనయుడు కామెడీ సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించారు. కానీ ఆ తర్వాత కొద్ది సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరమై మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఈయన నటించిన నాంది సినిమా తప్ప మిగిలిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. తాజాగా వచ్చిన 12 A రైల్వే కంపెనీ సినిమా కూడా దెబ్బ కొట్టడంతో అల్లరి నరేష్ హిట్ కి ఆమడ దూరంలో ఉండిపోయారు. అలా ఈ నలుగురు హీరోలు ఒకప్పుడు ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకొని చివరికి ఒక్క హిట్ సినిమా కోసం అగచాట్లు పడుతున్నారు.మరి ఈ నలుగురు హీరోలు సక్సెస్ ట్రాక్ ఎక్కేదెప్పుడు.. ఎప్పుడు విజయం వీరి ఖాతాలో పడుతుంది అనేది చూడాలి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి