టాలీవుడ్ నటసింహం, స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తన సినిమాలతోనే కాక, తన సూటి, బోల్డ్ కామెంట్స్‌తోనూ ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో పెద్ద చర్చకు దారి తీశాయి. బాలయ్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘అఖండ 2’ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, బాలయ్య చేసిన సంచలన వ్యాఖ్యలు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాయి.
బాలయ్య ఇటీవల మాట్లాడుతూ, ప్రస్తుత సినీ పరిశ్రమలో టెక్నాలజీ మయం అయిపోయి, ఒరిజినాలిటీ కొరవడుతోందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, 'గ్రీన్ మ్యాట్' (గ్రీన్ స్క్రీన్) సాంకేతికతపై ఆయన చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. "సెట్స్ కి రాకుండా, అంతా స్టూడియోల్లోనే గ్రీన్ మ్యాట్స్ లో షూటింగ్ చేసుకుంటున్న హీరోల్లా తాను డూప్లికేట్ కాదని, తాను ఒరిజినల్" అని బాలకృష్ణ గట్టిగా వెల్లడించారు.
నటుడిగా సన్నివేశాలను నేరుగా సెట్స్‌లో, ప్రజల మధ్య చిత్రీకరించడంలోనే అసలైన అనుభూతి, నటన ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. ఈ ప్రకటన ఇండస్ట్రీలోని కొత్త పోకడలను, టెక్నాలజీపై అతిగా ఆధారపడటాన్ని విమర్శిస్తున్నట్టుగా ఉంది. బాలయ్య చేసిన ఈ 'గ్రీన్ మ్యాట్' కామెంట్లు సోషల్ మీడియా వేదికగా అనేక ఊహాగానాలకు తెరలేపాయి. ఆయన ప్రధానంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు యువ, అగ్ర హీరోలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారని సినీ అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో భారీ గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ ఆధారిత సినిమాలు తీస్తున్న హీరోలను ఉద్దేశించే బాలయ్య ఈ విధంగా మాట్లాడి ఉంటారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బాలయ్య లాంటి సీనియర్ హీరో, స్టార్ చేసిన ఈ కామెంట్లు ఇండస్ట్రీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తాయో, దీనిపై ఇతర హీరోలు లేదా దర్శకనిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా, 'గ్రీన్ మ్యాట్' డూప్లికేట్ కామెంట్స్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్‌గా మారాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి