గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఐ బొమ్మ రవికి సంబంధించిన వార్తలే వస్తున్నాయి.. కొత్తగా వచ్చిన సినిమాలను హ్యాక్ చేసి తన వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు రవి.. దీని ద్వారా వచ్చిన సంపాదనను ఆయన చాలా రకాలుగా ఉపయోగించే వారని తెలుస్తోంది. ఇక ఐ బొమ్మ రవిని పోలీసులు పట్టుకున్న తర్వాత చాలా రోజుల నుంచి విచారణ చేస్తున్నారు. ఇదే సమయంలో విచారణలో భాగంగా అనేక విషయాలు బయటకు వచ్చాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. లావిష్ లైఫ్ కు అలవాటు పడ్డటువంటి రవి తనకు వచ్చిన సంపాదన మొత్తం ప్రతి 20 రోజులకు ఒకసారి ఫారిన్ ట్రిప్ కు వెళ్లడానికి ఉపయోగించేవారు.

అక్కడికి వెళ్లి కొనాళ్ల పాటు ఉండి ఎంజాయ్ చేసి మళ్లీ వచ్చేవారు. అంతేకాదు రవికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ని కూడా పోలీసులు గుర్తించారు.. ఆ డబ్బును రవి స్నేహితుడైనటువంటి నిఖిల్,రవి చెల్లి మధ్య పలు ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు కూడా తెలుస్తోంది.. క్రిప్టో కరెన్సీని వెంటనే సేకరించి ఖర్చు చేసేవాడు. అంతేకాకుండా రవి స్నేహితుడు నిఖిల్ రవికి సంబంధించిన వెబ్సైట్లో పలు పోస్టర్లు యాడ్ కు సంబంధించిన ప్రమోషనల్ మెటీరియల్ ను నిఖిల్ వెబ్సైట్లో అప్లోడ్ చేసే వారని తెలుస్తోంది. ఈ విధంగా రవికి సంబంధించిన ట్రాన్సాక్షన్లు, అంతర్జాతీయ సర్వర్లు,క్రిప్టో కరెన్సీ కి సంబంధించిన వ్యవస్థ మొత్తం  ఎలా జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.

కట్ చేస్తే రవిని పోలీసులు పట్టుకున్న తర్వాత ఆయనకు జనాల్లో చాలా ఆదరణ పెరిగింది. ఒకవైపు చూస్తే రవి చేసింది తప్పైనా కానీ, చాలామంది జనాలు ఆయన అలా అప్లోడ్ చేయడం వల్ల ఎంతో మంది ఇంటిదగ్గర ఎలాంటి ఖర్చు లేకుండా సినిమా చూసామని సపోర్ట్ చేస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి  సినిమాలు తీసి టికెట్ రేట్లు పెంచి మధ్యతరగతి ప్రజలు సినిమా చూడకుండా చేసిన సినిమా యాజమాన్యాల కంటే రవి చాలా బెటర్ అంటూ ఒక రకంగా సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మరి రవి చేసింది మంచి పనేనా కాదా మీరు కూడా కామెంట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: