అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రానికి ‘వృషకర్మ’ అనే శక్తివంతమైన టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ఖరారు చేసింది. ‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు కార్తీక్ దండు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన ప్రేక్షకులు, అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. చేతిలో స్టీల్ రాడ్‌ను శక్తివంతంగా తిప్పుకుంటూ, కండలు తిరిగిన శరీరంతో, రగ్డ్ అండ్ మ్యాన్లీ లుక్‌లో నిలబడి ఉన్న నాగచైతన్య పూర్తిగా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌ను చూసిన చాలామంది, చైతు ఈ సినిమాలో తన అద్భుతమైన సిక్స్‌ప్యాక్‌ను కూడా చూపించబోతున్నాడని అంచనా వేస్తున్నారు.


‘వృషకర్మ’ అనే పదానికి అసలు అర్థమేంటి?

‘వృషకర్మ’ అనే పదం సంస్కృతంలో ఎంతో లోతైన అర్థం కలిగి ఉంది. వృష / వృషభం అంటే సంస్కృతంలో ఎద్దు. ఈ ఎద్దు ధర్మానికి ప్రతీకగా భావించబడుతుంది. కర్మ అంటే తన పనిని పూర్తి చేయడం, కార్యసాధన. అందుకే ‘వృషకర్మ’ అంటే ధర్మబద్ధంగా, అచంచలంగా తన పనిని పూర్తి చేసే వ్యక్తి అని అర్థం. అదే విధంగా, విష్ణుమూర్తికి ఉన్న కోటి నామాల్లో ‘వృషకర్మ’ కూడా ఒకటి. ఈ నామం ఆయన భక్తులకు వరాలు ప్రసాదించే స్వరూపాన్నీ, ప్రకృతిలో వర్షాలు కురిపించే శక్తినీ సూచిస్తుంది. అందువల్ల ఈ టైటిల్‌లో శక్తి, ధర్మం, కార్యసాధన అన్న మూడు శక్తివంతమైన అర్థాలు దాగి ఉన్నాయి.



ఈ అర్థాలన్నీ కలిచివేసి చూస్తే, చిత్రబృందం నాగచైతన్య పాత్రను ఎంతో బలంగా, మానసికంగా మరియు శారీరకంగా శక్తివంతమైన వ్యక్తిగా డిజైన్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ కూడా అదే వైబ్రేషన్‌ను ఇస్తోంది.


‘విరూపాక్ష’తో సూపర్ సక్సెస్ అందుకున్న కార్తీక్ దండు, ఇప్పుడు నాగచైతన్యతో యాక్షన్ అడ్వెంచర్ జానర్లో సినిమా చేయడం సినీ ప్రేక్షకులను మరింతగా ఎక్స్‌సైట్ చేస్తోంది. ఇప్పటికే నాగచైతన్య పాన్-ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఎంపిక చేస్తున్న విషయం తెలిసిందే. ‘వృషకర్మ’ కూడా అదే స్థాయి రేంజ్‌కు తీసుకెళ్లే అవకాశమున్న ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు.అంతేకాదు, కార్తీక్ దండు అక్కినేని నాగార్జునతో కూడా ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీంతో అక్కినేని కుటుంబం – కార్తీక్ దండు కాంబినేషన్ పక్కా హైప్ క్రియేట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: