జానీ మాస్టర్ ఈ మధ్యకాలంలో వరుస వివాదాల్లో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే.ఎప్పుడైతే ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేసిన శ్రష్టి వర్మ బయటికి వచ్చి ఆయనపై కేసు పెట్టిందో అప్పటినుండి ఆయన వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు.అయితే కొంతమంది ఈయన్నీ విమర్శిస్తుంటే మరి కొంత మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎన్నిసార్లు చెప్పాలి రా నీకు అంటూ లైవ్ లోనే వార్నింగ్ ఇచ్చింది.మరి ఇంతకీ జానీ మాస్టర్ చేసిన తప్పేంటి.. ఎందుకు రేణు దేశాయ్ ఆయనకు వార్నింగ్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.. రేణుదేశాయ్ తాజాగా మరో కొత్త సినిమా చేయడానికి ఒప్పుకుంది.ఈ సినిమాలో ఆమె అత్త పాత్రలో నటిస్తోంది. 

అయితే ఈ సినిమా ఈవెంట్ కి రేణు దేశాయ్, జానీ మాస్టర్, యాంకర్ అనసూయ  ఇలా ఎంతోమంది వచ్చారు. అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన జానీ మాస్టర్ అనసూయ దగ్గరికి వెళ్లి పలకరించారు. ఆ తర్వాత రేణు దేశాయ్ ని చూడగానే సారీ వదినా చూసుకోలేదు అంటూ రేణు దేశాయ్ దగ్గరికి వస్తూ దండం పెట్టి హాయ్ వదిన అని పిలుస్తాడు.అయితే అలా పిలవడంతోనే రేణు దేశాయ్ కి ఎక్కడో మండినట్టుంది.వెంటనే వదిన కాదు అక్క అని పిలువు.. ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు.. అక్కా అని పిలవమని అని రేణుదేశాయ్ జానీ మాస్టర్ కి వార్నింగ్ ఇవ్వడంతోనే సారీ అక్క లోపల నుండి అలా వచ్చేస్తుంది అంటూ జానీ మాస్టర్ నవ్వుతారు.

అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్లు పవన్ కళ్యాణ్ నుండి రేణు దేశాయ్ విడిపోయినప్పటికీ ఆయన అభిమానులకు మీరు వదిన గానే ఉంటారు. మిమ్మల్ని అక్క అని పిలవడం అసంభవం.. ఎన్ని రోజులైనా మిమ్మల్ని పిలిచే పిలుపు మారదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు చాలామంది రేణు దేశాయ్ ని వదిన అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి.ఆ సమయంలో రేణుదేశాయ్ వారికి వార్నింగ్ ఇచ్చి పిలిస్తే అక్క అని పిలవండి.. లేకపోతే రేణు దేశాయ్ అని పిలవండి.ఈ పిలుపుతో మాత్రం పిలవకండి అంటూ చెప్పింది. అయినప్పటికీ ఫ్యాన్స్ తరచూ ఆమెని వదిన అనే పిలుస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: