టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలలోనే నటిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ సినిమాల లైనప్ లో కూడా టాప్ లో ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఒక్కో చిత్రాన్ని పూర్తి చేసే పనిలో పడ్డారు ప్రభాస్. వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన ది రాజా సాబ్ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. అలాగే ఫౌజీ, స్పిరిట్  సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు. ఇటువంటి తరుణంలోనే ప్రభాస్ గురించి ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


అదేమిటంటే ప్రభాస్ మరో ఆరు నెలల పాటు కనిపించరనే వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఇటీవలే స్పిరిట్ సినిమాకి సంబంధించి ప్రభాస్ లుక్ లీక్ అవ్వడమే కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారని.. ఈ లుక్ ప్రభాస్ అభిమానులను చాలా సర్ప్రైజ్ అయ్యేలా చేస్తుందని కానీ ఈ లుక్ సంబంధించి ఎటువంటి పరిస్థితులలో లీక్ అవ్వకూడదని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది. అందుకే ప్రభాస్ మరో ఆరు నెలల పాటు పబ్లిక్ ఈవెంట్ కి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం.


ముఖ్యంగా ప్రభాస్ ఎక్కడ కనిపించినా సరే ఇది సినిమా లుక్ అంటూ చాలామంది నెటిజెన్స్, అభిమానులు సోషల్ మీడియాలో ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అందుకే కొన్ని నెలల పాటు ప్రభాస్ ఎటువంటి కార్యక్రమాలకు హాజరు కాకూడదని సందీప్ రెడ్డివంగా సూచించారట. ఈ విషయం విన్న ప్రభాస్ అభిమానులలో కొంతమేరకు నిరాశ కనిపించినప్పటికీ, సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్ ప్రభాస్ ని ఎలా చూపిస్తారనే విషయంపై చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో  త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటించగా వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ తదితర నటీనటులు నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: