సూపర్‌స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా..వేరే లేవల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్.  అభిమానులచే ‘తలైవా’గా గౌరవించబడే ఆయన నటించిన సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు బాక్స్ ఆఫిస్ షేక్ అయిపోవాల్సిందే.  నిజానికి రజనీకాంత్ అభిమానులు ఆయనని ఓ హీరోలా కాదు దేవుడిలా భావిస్తుంటారు. ఇండియాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా కూడా అతనికిఅభిమానుల ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. ఇలాంటి అభిమానంలోనే, రజినీకాంత్ వారసుడు ఎవరో తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరో వారసులు ఇండస్ట్రీలోకి రావడం పెద్ద గొప్ప ఏమి కాదు.


అందులోనే ఆ వారసుడి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అతను మరెవరో కాదు, రజినీకాంత్ మనవడు. నటుడు ధనుష్, హీరోయిన్ ఐశ్వర్య రజినీకాంత్ సంతానం అయిన యాత్రా రాజా. యాత్రా రాజా ఇప్పుడు 19 ఏళ్ళ వయసులోకి అడుగుపెట్టాడు. చదువులో టాప్. చాలా సైలెంట్ ఫెలో. కానీ కంటి చూపుతోనే ఏం చెప్పాలి అనుకుంటున్నాడో చెప్పేస్తాడు. 2006 అక్టోబర్ 10న పుట్టిన ఆయన ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తాజాగా ఆయన పిక్స్ కి తాత రజనీకాంత్ పిక్స్చర్స్ యాడ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.



యాత్రా రాజా చూడటానికి అచ్చం తాత రజినీకాంత్‌ని పోల్చి ఉండటం ఫ్యాన్స్ ని మరింత అట్రాక్ట్ చేస్తుంది.  ఫ్యూచర్ లో రజనీకాంత్ వారసుడు ఆయనే అని అంటున్నారు అభిమానులు.  దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతనిదే నెక్స్ట్ జనరేషన్ సూపర్‌స్టార్ అవుతాడని అభిమానులు విశ్వసిస్తున్నారు. చిన్న వయసులోనే, తండ్రి ధనుష్ సినిమాకు సంబంధించిన ఒక పాటకు లిరిక్స్ కూడా అందించాడని వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో స్క్రీన్‌పై తన ప్రతిభతో మెరవబోతోన్న ఈ యువ హీరో, త్వరలో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తెగ మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: