కొంత కాలం క్రితం బాలీవుడ్ నటుడు రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా "యానిమల్" అనే మూవీ ని రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ ని 2023 వ సంవత్సరం డిసెంబర్ 1 వ తేదీన విడుదల చేశారు. ఈ మూవీ విడుదల అయ్యి ఈ రోజుతో రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సమయంలో ఎన్ని కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగి , ఎన్ని కోట్ల లాభాలను అందుకుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 12 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 2.42 కోట్లు , ఉత్తరాంధ్ర లో 3.40 కోట్లు , ఈస్ట్ లో 1.56 కోట్లు , వెస్ట్ లో 1.40 కోట్లు , గుంటూరు లో 1.61 కోట్లు , కృష్ణ లో 2.01 కోట్లు , నెల్లూరు లో 1.15 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 25.55 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.85 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25.55 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 15.35 కోట్ల లాభాలు అందాయి. దానితో ఈ మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rk