- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా మహేష్ బాబు పి . దర్శకత్వంలో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఆంధ్రా కింగ్ తాలూకా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమాకు టాక్ బాగుంది. రివ్యూ రేటింగ్ లు కూడా బాగానే వచ్చాయి. అయితే కలెక్షన్లు మాత్రం రావడం లేదని ట్రేడ్ వర్గాలలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 65 కోట్లు కాగా ... నాలుగు రోజులకు వరల్డ్ వైడ్ గా వచ్చిన షేర్ కేవలం 9 కోట్లు. డిజిటల్ రైట్స్ రూపంలో 30 కోట్లు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఇక‌ మిగిలింది థియేటర్ బిజినెస్ మీద రాబట్టుకోవాలి తొలివారం ముగిసేసరికి కేవలం 30 శాతం మాత్రమే రికవరీ అయింది. ఇంకా ఏ మేరకు వసూళ్లు వస్తాయి అంటే చెప్పలేని పరిస్థితి. ఈ సినిమా నిర్మించిన movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ కు కనీసం రు. 20 కోట్లు పైగా నష్టాలు తప్పవని అంటున్నారు.


ఆ మాటకొస్తే ఇటీవల కాలంలో రామ్ నటించిన ఏ సినిమా కూడా హిట్ అవ్వటం లేదు. అయితే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు కాస్త ముందుగానే హైప్‌ వచ్చింది. బాగానే ఆడుతుందని అనుకున్నారు. అయితే అంద‌రి అంచ‌నాలు తారుమారు రామ్ కెరీర్ లో మరో భారీ డిజాస్టర్ గా నిలిచింది. హిట్ అందుకుందన్న ఆనందం హీరోయిన్ భాగ్యశ్రీ కి లేకుండా పోయింది. ఆమె కూడా వరుస ప్లాపుల ప‌రంప‌ర‌ కంటిన్యూ చేస్తుంది. ఈ సినిమా రిజ‌ల్ట్ ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన చర్చలకు తెరలేపిన‌ట్లైంది. సినిమాకు రివ్యూస్ రేటింగ్స్ పాజిటివ్గా వచ్చినా .. ఒకవేళ బలవంతంగా ఇప్పించినా జనాలు మాత్రం వాటిని లెక్కచేయలేదని రివ్యూల ప్రభావం సినిమాలపై లేదని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ లో రామ్ ఎప్పుడు హిట్ కొడతాడు ? ఎప్పుడు తన ప్లాపుల‌ పరంపరకు బ్రేకులు వేస్తాడో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: