టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందింది. బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందిన సినిమా కావడంతో అఖండ 2 మూవీ పై బాలయ్య అభిమానులతో పాటు మామూలు తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అఖండ 2 మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటించగా ... బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలలో పెద్ద ఎత్తున విడుదల చేయనున్నారు. 

ప్రస్తుతం ఈ మూవీ కి బుక్ మై షో ఆప్ లో అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. బుక్ మై షో లో ఇప్పటికే ఈ మూవీ కి 100 కే ఇంట్రెస్ట్ లు లభించాయి. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై జనాల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: