తెలుగు బిగ్ బాస్ 9 సీజన్ ముగింపు దశకి చేరబోతోంది. మరి కొన్ని రోజులలో బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరనేది  తేలనుంది.అయితే ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ లలో ఎవరు గెలుస్తారనే విషయం నాలుగైదు సార్లు మాత్రమే క్లారిటీ వచ్చింది. కానీ బిగ్ బాస్ సీజన్ 9 లో మాత్రం చాలా కఠినంగా మారినట్టుగా కనిపిస్తోంది. ఒక్కో వారం ఒక్కొక్కరు హైలైట్ గా నిలుస్తున్నారు కంటెస్టెంట్స్. హౌస్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన వారు ప్రస్తుతం టాప్ లో ఉండగా ,స్టార్ కంటెస్టెంట్ గా వచ్చి లీస్టులో చివరిగా సరిపెట్టుకుంటున్నారు.


వాస్తవానికి ఈ సీజన్ మొదటి నుంచి తనుజానే విన్నర్ అంటూ చాలామంది కామెంట్స్ చేశారు. ఇప్పటివరకు ఓటింగ్ లో ఆమె టాప్ ఉండేది. అలాగే సుమన్, ఇమ్మాన్యుయేల్ కి ఓటింగ్ కూడా బాగానే సంపాదించుకున్నారు. గత కొద్ది వారాలుగా తన ఆట, మాటతీరుతో సరైన సమయాలలో సరైన స్టాండ్ తీసుకోవడం వల్ల  కళ్యాణ్ పడాల కూడా టాప్ పొజిషన్లోకి చేరుకున్నారు. తనూజ భరణితో నాన్న అంటూ తిరిగి చిన్న విషయాలకు కూడా ఆర్గ్యు చేయడం వల్ల ఆడియన్స్ కి కూడా చిరాకు తెప్పించేలా చేసింది. ఇమ్మాన్యుయేల్ విషయానికి వస్తే.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఎటువంటి సపోర్టు లేకుండా వచ్చారు. ఇప్పుడు ఆడియన్స్ సపోర్టుతో తన ఆటతీరుతో కొనసాగిస్తున్నారు.


ప్రస్తుతం ఈ ముగ్గురు టాప్ లో కనిపిస్తున్నారు. సీజన్ ప్రారంభంలో సుమన్ శెట్టి విన్నర్ అంటు చాలామంది కామెంట్స్ చేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో చాలావరకు తగ్గిపోయినట్లుగా కనిపిస్తోంది. సుమన్ శెట్టి ప్రస్తుతం ఐదవ పొజిషన్లో కనిపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ లో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆడియన్స్ తెలుపుతున్నారు. మరి ఫైనల్ విన్నర్ ఎవరనే విషయం మరికొద్ది వారాల్లో తేలబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: