ఎలర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గత కొంత కాలంగా ఎక్కువ శాతం మాస్ యాక్షన్ మూవీలతో పేక్షకులను పలకరిస్తూ వచ్చాడు. ఆయన వరుసగా నటించిన మూడు పవర్ఫుల్ యాక్షన్ మూవీలు అయినటువంటి ది వారియర్ , స్కంద , డబుల్ ఈస్మార్ట్ సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దానితో చాలా మంది రామ్ క్లాస్ మూవీ చేస్తే బాగుంటుంది. మాస్ మూవీ లు ఆయనకు పెద్దగా సెట్ అవడం లేదు. ఒక క్లాస్ మూవీ చేస్తే ఖచ్చితంగా ఆయనకు ఆ సినిమా ద్వారా మంచి విజయం దక్కుతుంది అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేశారు. ఇక రామ్ కూడా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీలను పక్కన పెట్టి ఆంధ్ర కింగ్ తాలూకా అనే ఒక క్లాస్ సినిమాలో హీరోగా నటించాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ నవంబర్ 27 వ తేదీన థియేటర్లు విడుదల అయింది. ఈ మూవీకి మంచి టాక్ కూడా వచ్చింది.

దానితో రామ్ అభిమానులు , సాధారణ ప్రేక్షకులు కూడా రామ్ క్లాస్ మూవీలో నటిస్తే దాదాపుగా విజయాన్ని అందుకుంటాడు. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది అనే ఆశభావాన్ని వ్యక్తం చేశారు. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు మాత్రం దక్కడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఆరు రోజులు బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఆరు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.27 కోట్ల షేర్ ... 17.10 గ్రాస్ కలెక్షన్లు దక్కగా ప్రపంచ వ్యాప్తంగా 13.73 కోట్ల షేర్ ... 24.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయి. ఈ మూవీ హిట్ కొట్టాలి అంటే మరో 14.27 కోట్ల షేర్ కలెక్షన్లు రాబట్టాలి. ఇక రేపు అనగా డిసెంబర్ 5 వ తేదీన అఖండ 2 మూవీ విడుదల కానుండడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత తగ్గుతాయి అని చాలా మంది అంచనా వేస్తున్నారు. దానితో ఆంధ్ర కింగ్ తాలూకా యూనిట్ కి మరో టెన్షన్ మొదలైంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: