జబర్దస్త్ కమెడియన్లలో కమెడియన్ పంచ్ ప్రసాద్ తన కామెడీ టైమింగ్ తో ఎంతోమంది ప్రేక్షకులను అలరించారు. అయితే తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన పరీక్షలలో కిడ్నీ వైఫల్యం దాని ద్వారా ఎదురైన సమస్యల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని ఎన్నో ఇంటర్వ్యూలలో నిర్మొహమాటంగా తెలియజేశారు. ఇప్పుడు తాజాగా ఇంటర్వ్యూలో మరొకసారి తాను ఎదుర్కొన్న విషయాలను పంచుకున్నారు.



పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ.. దేవుడు నాకు ఎన్నో కష్టాలను ఇచ్చారు, ప్రొఫెషనల్ విజయం సాధించినప్పటికీ ఆరోగ్యం సహకరించలేకపోవడంతో వెనకబడాల్సి వచ్చిందంటూ తెలిపారు. తన కిడ్నీ వైఫల్యానికి ముఖ్య కారణం బిపి అని, ఈ విషయం తనకు ముందు తెలియదని తెలిపారు. ఎంగేజ్మెంట్ తర్వాత తన భార్య ముక్కు నుంచి వస్తున్న రక్తాన్ని గమనించి వైద్య పరీక్షలు చేయించుకోమని చెప్పడంతో అప్పుడు కిడ్నీ సమస్య బయటపడిందని తెలిపారు ప్రసాద్. ఆ తర్వాత కొద్ది నెలల నుంచి  డయాలసిస్ చేయించుకుంటున్నానని, తనకు ఒక నిత్యకృత్యంగా మారిందని తెలిపారు.


కొన్నిసార్లు జబర్దస్త్ స్టేజ్ మీద ప్రదర్శన ఇవ్వడానికి ముందు కూడా డయాలసిస్ చేయించుకున్నానని ఒకానొక సమయంలో ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు, శారీరక నొప్పితో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత జబర్దస్త్ లో ఉండే కొంతమంది టీమ్ లీడర్స్, ఆర్టిస్టులు, జడ్జిలు అందరూ కలిసి తన ఆపరేషన్ కు సహకరించారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రసాద్ భార్య కిడ్నీ దానం  చేసిందని.. అయితే అప్పటి మంత్రి రోజా చొరవతో అప్పటి ప్రభుత్వంతో మాట్లాడి పంచ్ ప్రసాద్ ఆసుపత్రి ఖర్చులను కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేసి వైద్య సహాయం చేశారని తెలిపారు..బిపి అనేది సైలెంట్ కిల్లర్, దీనిని ఎవరు అశ్రద్ధ చేయవద్దు అది తెలియకుండానే కిడ్నీలు, గుండె వంటి వాటిని దెబ్బతీస్తుంది. ఎప్పటికప్పుడు ఆరోగ్యం గురించి టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: