- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

బాల‌య్య అఖండ 2 తాండ‌వం లో బోయ‌పాటి పాత సినిమాల వాస‌న‌లు బాగా గుబాలించాయి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇండియాకు అయితే పాకిస్తాన్‌ను లేదా చైనాను విల‌న్‌గా చూపించే కంటెంట్ అయితే మ‌న జ‌నాలు బాగా క‌నెక్ట్ అవుతారు అని డిసైడ్ అయిన బోయ‌పాటి చైనా మిల‌ట్రీ మ‌న దేశాన్ని టార్గెట్ చేస్తున్న‌ట్టుగా క‌థ అల్లేశాడు. చైనా మిల్ర‌టీ కుంభ‌మేళా జ‌రుగుతున్న‌ప్పుడు ఓ వైర‌స్‌ను నీళ్ల‌లో క‌ల‌ప‌డం ద్వారా మ‌న దేశ ప్ర‌జ‌ల‌ను చంపేందుకు కుట్ర ప‌న్నుతుంది. అయితే ఇది ఎప్పుడో ప‌దిహేనేళ్ల క్రిత‌మే సూర్య హీరోగా వ‌చ్చిన సెవెన్త్‌సెన్స్ సినిమాలో మురుగ‌దాస్ చైనా వాళ్లు కుక్క‌కు ఇంజ‌క్ష‌న్ ఇచ్చే వైర‌స్ పంపుతాడు. చైనా నుంచి ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ పొందిన డాంగ్లీ ఇండియాకు వ‌చ్చి ఓ కుక్క‌కు వైర‌స్‌ను ఎంజెక్ట్ చేస్తాడు. ఆ కుక్క ద్వారా దేశంలో అంద‌రికి ఆ వైర‌స్ సోకి వాళ్ల‌ను చంపాల‌న్న‌దే చైనా ప్లాన్‌.


ఇక్క‌డే సేమ్ ప్లాన్ బోయ‌పాటి ఫాలో అయ్యాడు. కాక‌పోతే ఇక్క‌డ బోయ‌పాటి కుంభ‌మేళాకు వ‌చ్చే భ‌క్తుల‌కు నీళ్ల ద్వారా వైర‌స్ బాడీలోకి ఇంజెక్ట్ చేయించాడు. చైనా ఇండియాపై ప్ర‌యోగించే బ‌యోవార్ అని మురుగ‌దాస్ చెప్పిన‌ట్టు ఇక్క‌డ కూడా అదే బ‌యోవార్ చైనా ఇండియాపై ప్ర‌యోగించింది.  ఫ‌స్టాఫ్‌లో కుంభ‌మేళా సీన్ స్టార్ట్ అయ్యాక వ్యాక్సిన్ టెస్టింగ్ సీన్లు వ‌స్తున్న‌ప్పుడు అర‌గంట పాటు తెర‌మీద బాల‌య్య స్క్రీన్ ప్రెజెన్సీయే ఉండ‌దు.. సినిమా అలా వెళుతూ ఉంటుంది.. మ‌నం చూస్తూ ఉంటాం అంతే.. !


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: