హిందూ ధర్మం నేపథ్యంగా రూపొందిన ఈ సినిమాలోని శక్తివంతమైన కథ, ఆధ్యాత్మిక అంశాలు, బాలకృష్ణ మాస్ అవతార్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది.ఈ నేపథ్యంలోనే ‘అఖండ 2’ సినిమా ప్రదర్శన సమయంలో ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. సినిమా చూస్తున్న సమయంలో ఓ మహిళ ఒక్కసారిగా పూనకం వచ్చినట్లుగా ఊగిపోవడం అక్కడి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నందమూరి బాలకృష్ణ చేసిన శివతాండవం సన్నివేశాన్ని చూసిన వెంటనే ఆ మహిళకు పూనకం వచ్చినట్లు తెలుస్తుంది.
ఆ మహిళ పూనకం తో ఊగిపోతుండటాన్ని గమనించిన అక్కడున్న తోటి ప్రేక్షకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే కొందరు ఆమెను శాంతింపజేసేందుకు ప్రయత్నించగా, మరికొందరు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో వీడియోలుగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, సినిమా ప్రభావం ఎంత స్థాయిలో ఉందో దీనితో అర్థమవుతోందని కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉండగా, తాజాగా ‘అఖండ 2’ సినిమా చూడటానికి అఘోరాలు కూడా థియేటర్లకు వచ్చారనే విషయం వెలుగులోకి రావడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా లోని ఆధ్యాత్మిక శక్తి, శివభక్తి అంశాలు అందరినీ ఆకర్షిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా చూస్తే, ‘అఖండ 2’ సినిమా కేవలం బాక్సాఫీస్ వద్దే కాకుండా, ప్రేక్షకుల మనసులపై కూడా గాఢమైన ప్రభావాన్ని చూపుతూ ముందుకు సాగుతోంది. నందమూరి బాలకృష్ణ నటన, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఆధ్యాత్మిక వాతావరణం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి