టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... నిధి అగర్వాల్ , మలవిక మోహన్ , రీద్ధి కుమార్ లు ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కనిపించబోతున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రమోషన్ల జోరును పెంచుతూ వస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను ,  సాంగ్స్ ను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... రాజా సాబ్ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ను డిసెంబర్ 27 వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు , అందుకు అనుగుణంగా అన్ని పనులను పూర్తి చేస్తున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఈ మూవీ బృందం వారు అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: