తాజాగా విడాకులు తీసుకున్న ఆ సినీ సెలబ్రిటీ మరెవరో కాదు… మలయాళ నటుడు షిజు ఏఆర్. మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన షిజు, తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. దేవి, సింహరాశి, నువ్వు నాకు నచ్చావ్, గౌతమ్ ఎస్ఎస్, శతమానం భవతి వంటి విజయవంతమైన తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించాడు. ఇటీవల నితిన్ హీరోగా నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమాలో కూడా షిజు కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
షిజు వ్యక్తిగత జీవితానికి వస్తే… ప్రీతి అనే యువతిని ప్రేమించి 2008లో వివాహం చేసుకున్నాడు. మతం వేరు అయినప్పటికీ వ్యక్తిత్వమే ముఖ్యమని భావించి ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారి ప్రేమకు గుర్తుగా వారికి ఒక కూతురు కూడా ఉంది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ దంపతుల మధ్య ఇటీవల కాలంలో మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ మనస్పర్థల కారణంగానే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దాదాపు 17 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని షిజు స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.
షిజు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. “ప్రీతి మరియు నేను ఇప్పుడు అధికారికంగా విడాకులు తీసుకున్నాము. పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. అయితే మేము ఒకరినొకరు గౌరవించుకుంటూ మంచి స్నేహితులుగా కొనసాగుతాం. ఈ నిర్ణయం పూర్తిగా అవగాహనతో తీసుకున్నది. మీడియా మరియు స్నేహితులు మా గోప్యతను గౌరవించాలని, ఎలాంటి రూమర్స్‌ను వ్యాప్తి చేయవద్దని మనస్పూర్తిగా కోరుతున్నాను. మా వ్యక్తిగత జీవితాల్లో ముందుకు సాగుతున్న ఈ సమయంలో మాకు మద్దతు ఇవ్వాలని దయచేసి అభ్యర్థిస్తున్నాం.” అంటూ రాసుకొచ్చారు. దీని పై నెటిజన్స్ భిన్న విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. “ఇది చాలా బాధాకరమైన విషయం”, “ఇంత కాలం కలిసి ఉన్న జంట విడిపోవడం నిజంగా షాక్” అంటూ కన్నీటి ఎమోజీలతో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అలాగే “అసలు వీళ్లు ఎందుకు విడాకులు తీసుకున్నారు?” అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంలో స్పష్టమైన కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి