2004లో విడుదలైన 'ఆనంద్' సినిమా శేఖర్ కమ్ముల కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. అప్పటికే ఆయన 'డాలర్ డ్రీమ్స్' సినిమా చేసినప్పటికీ, 'ఆనంద్' సినిమాతోనే ఆయనకు దర్శకుడిగా గుర్తింపు లభించింది. ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ చిత్రం 'శంకర్ దాదా ఎంబీబీఎస్' కు పోటీగా విడుదలైంది. ఒక చిన్న సినిమా, ఒక పెద్ద స్టార్ సినిమాతో పోటీ పడి విజయం సాధించడం అప్పట్లో ఒక సంచలనం.ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు 'రూప'. రూప పాత్ర కేవలం ఒక గ్లామర్ బొమ్మలా కాకుండా, ఆత్మగౌరవం ఉన్న, స్వతంత్ర భావాలు కలిగిన ఒక మధ్యతరగతి అమ్మాయిగా కనిపిస్తుంది. పెళ్లి పీటల మీద తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన వరుడిని వదిలేసి వచ్చే ధైర్యం ఉన్న పాత్ర అది. ఈ పాత్రలో కమలినీ ముఖర్జీ తన అభినయంతో ప్రాణం పోశారు.


కమలినీ ముఖర్జీ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. కానీ, దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ పాత్ర కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ కమలినీ కాదు. ఆయన సదా ను ఈ పాత్ర కోసం సంప్రదించారట. ఆ సమయంలో సదా టాలీవుడ్‌లో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన 'జయం' సినిమాతో ఆమె సెన్సేషన్ క్రియేట్ చేశారు. "వెళ్ళవయ్యా వెళ్ళూ" అనే డైలాగ్‌తో ఆమె యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.


ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన 'నాగ' వంటి పెద్ద చిత్రాల్లో కూడా నటించారు. ఆ బిజీ షెడ్యూల్స్ వల్లనో లేదా ఇతర కారణాల వల్లనో కానీ, సదా 'ఆనంద్' సినిమా ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది.సదా నో చెప్పడం కమలినీ ముఖర్జీకి వరంగా మారింది. శేఖర్ కమ్ముల తన కథకు సరిపోయే కొత్త ముఖం కోసం వెతుకుతున్న క్రమంలో కమలినీని ఎంపిక చేశారు. ఆమె బెంగాలీ అమ్మాయి అయినప్పటికీ, తన హావభావాలతో తెలుగమ్మాయిలా ఒదిగిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: