సినిమా ఇండస్ట్రీ లో అందం , అభినయం , అద్భుతమైన నటన ప్రదర్శించే కేపాసిటీ ఉన్నా కూడా విజయాలు ఎవరికైతే ఎక్కువగా దక్కుతాయో వారికి అద్భుతమైన క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతూ ఉంటాయి. ఇక అందం , అభినయం , అద్భుతమైన నటన ప్రదర్శించే టాలెంట్ ఉన్నా కూడా ఎవరికైతే మంచి విజయాలు దక్కవో వారికి క్రేజీ సినిమాలలో , స్టార్ హీరోల సినిమాలలో పెద్దగా అవకాశాలు దక్కవు. ఇకపోతే అందం , అభినయం ఉన్నా కూడా విజయాలు లేకపోవడంతో ఓ ముద్దుగుమ్మ కెరియర్ చాలా వెనకబడిపోయింది. ఆమె ఎవరు అనుకుంటున్నారా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ డింపుల్ హయాతి. ఈమె గద్దల కొండ గణేష్ సినిమాలో ఐటమ్ సాంగ్లో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఈ మూవీ లో ఈ బ్యూటీ చేసిన ఐటమ్ సాంగ్ అదిరిపోయే రేంజ్ లో సక్సెస్ కావడం , అందులో ఈమె తన అందాలతో , డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సాంగ్ ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు వచ్చింది. 

ఆ తర్వాత ఈమె రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడీ , గోపీచంద్ హీరోగా రూపొందిన రామబాణం అనే తెలుగు సినిమాలలో హీరోయిన్గా నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దానితో ఈమెకు తెలుగులో అవకాశాలు కూడా చాలా వరకు తగ్గాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈమె రవితేజ హీరోగా రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా కనుక మంచి విజయం సాధిస్తే డింపుల్ హయాతి కి మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది అని , ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగులో క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ద్వారా డింపుల్ హయాతి కి ఎలాంటి విజయం , ఎలాంటి క్రేజ్ దక్కుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: